సెక్షన్8 కోసం ఢిల్లీలో: రామ్మోహన్ నాయుడు, మంత్రి ఆస్తులపై పిటిషన్ ఉపసంహరణ

న్యూఢిల్లీ: హైదరాబాదులోని సీమాంధ్రుల రక్షణ కోసమే తాము సెక్షన్ 8 డిమాండ్ చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ యువనేత, ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు సోమవారం నాడు ఢిల్లీలో చెప్పారు. సెక్షన్ 8 అమలు చేయాల్సిందేనని చెప్పారు.

ఈ అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో తాము లేవనెత్తుతామని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో విభజన కోసం రూపొందించిన చట్టంలో అంతర్భాగమైన సెక్షన్ 8 అమలులో తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరాలు ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు.

సీమాంధ్రుల రక్షణకే తాము సెక్షన్ 8 డిమాండ్ చేస్తున్నామని, ఇదే విషయాన్ని తాము కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోవాలని ఆయన హితవు పలికారు.

Rammohan Naidu bats for Section 8

మంత్రి నారాయణ ఆస్తులపై పిటిషన్ ఉపసంహరణ

ఏపీ మంత్రి నారాయణ ఆస్తుల పైన సీబీఐ విచారణ జరిపించాలంటూ ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది దానిని ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. ఉపసంహరించుకుంటారా? లేదా కొట్టివేయాలా? అని జడ్జి ప్రశ్నించగా.. ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+