పెళ్లి సంబరం: ఎన్టీఆర్ పాటకు రామ్మోహన్నాయుడు సూపర్‌డ్యాన్స్(వీడియో)
శ్రీకాకుళం: శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్నారు. పెళ్లికి రెండే రోజులు సమయం ఉండటంతో ఆయన ఇంట్లో పెళ్లి సందడి ఇప్పటికే మొదలైంది.
విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ద్వితీయ పుత్రిక శ్రావ్యను రామ్మోహన్ నాయుడు వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరి వివాహానికి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదిక కానుంది.
రామ్మోహన్ నాయుడి సొంతూరులో ఇప్పటికే వేడుకలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి సంగీత్ ఘనంగా జరిగింది. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసి సందడి చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఎన్టీఆర్ 'బాద్‌షా'లోని 'బంతిపూల జానకి' పాటకు ఎంపీ రామ్మోహన్ అదిరిపోయే స్టెప్పులేశారు. కాగా, జూన్ 14న రాత్రి రిసెప్షన్ ఉంటుంది. జూన్ 15వ తేదీ తెల్లవారుజామున 03.01 గంటల శుభ ముహూర్తానికి రామ్మోహన్నాయుడు, శ్రావ్యల వివాహం ఘనంగా జరగనుంది. ఎంపీ వివాహానికి సీఎం చంద్రబాబుతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications