రామోజీ మనవరాలి పెళ్లిలో జగన్: చేయి కలిపిన కేసీఆర్-బాబు (ఫోటోలు)

రామోజీ రావు మనవరాలు సహరి వివాహ వేడుకకు రామోజీ ఫిల్మ్ సిటీ వేదిక అయింది. ఈనాడు ఎండీ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ల పెద్ద కుమార్తె సహరి.

హైదరాబాద్: రామోజీ రావు మనవరాలు సహరి వివాహ వేడుకకు రామోజీ ఫిల్మ్ సిటీ వేదిక అయింది. ఈనాడు ఎండీ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ల పెద్ద కుమార్తె సహరి.

రేచస్‌తో సహరి వివాహం

రేచస్‌తో సహరి వివాహం

భార‌త్‌ బయోటెక్‌ సంస్థ అధినేత కృష్ణ, సుచిత్రల కుమారుడు రేచస్‌ వీరేంద్రదేవ్‌తో వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు జకీయ, పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు.

విద్యుద్ధీప కాంతులతో..

విద్యుద్ధీప కాంతులతో..

వివాహ వేడుక సందర్భంగా రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రత్యేకంగా ముస్తాబైంది. విద్యుద్దీప ధగధగ కాంతులతో కాంతులీనింది.

Recommended Video

    Sai Pallavi gets star fans! Samantha tweeted About Fidaa
    చంద్రబాబు, కేసీఆర్, వెంకయ్యలు హాజరు

    చంద్రబాబు, కేసీఆర్, వెంకయ్యలు హాజరు

    సహరి వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. వారు వధూవరులను ఆశీర్వదించారు.

    ఏపీ స్పీకర్, టి మంత్రులు

    ఏపీ స్పీకర్, టి మంత్రులు

    వీరితో పాటు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహా రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వచ్చారు.

    ఏపీ మంత్రులు, వైసిపి అధినేత జగన్

    ఏపీ మంత్రులు, వైసిపి అధినేత జగన్

    ఏపీ మంత్రులు నారా లోకేశ్‌, కామినేని శ్రీనివాసరావు, కళా వెంకట్రావ్‌, ఎంపీ కవిత, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, తెలంగాణ టిడిపి నేత రేవంత్‌ రెడ్డి, ఏపీ ప్రతి పక్ష నేత వైయస్ జగన్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానా రెడ్డి, బిజెపి నేత కిషన్‌ రెడ్డి తదితరులు వివాహ వేడుకకు హాజరయ్యారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+