తెరాసపై రమ్య ఫిర్యాదు, పాలమూరు ఇంఛార్జిగా గౌడ్

హరీష్ రావుపై విహెచ్ ఆగ్రహం
కేంద్రమంత్రి జైరాం రమేష్ పైన తీవ్ర విమర్శలు చేసిన తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ రాజ్సభ సభ్యులు వి హనుమంత రావు వేరుగా మండిపడ్డారు. తెలంగాణ రావడం కెసిఆర్, హరీష్ రావులకు ఇష్టం లేనట్లుందన్నారు. తెలంగాణ రావడానికి కారణమైన జైరాం పైనే తెరాస విమర్శలు దారుణమన్నారు. సోనియా త్యాగానికి తెరాస ఇచ్చే గౌరవం ఇదా అని ప్రశ్నించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరి పోరు: హరీష్ రావు
మున్సిపల్ ఎన్నికలలో తాము ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని హరీష్ రావు చెప్పారు. అదిలాబాద్ నుండి ఖమ్మం వరకు అన్ని వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడతామన్నారు. ఉత్తర తెలంగాణలో మెజార్టీ స్థానాలను తెరాస కైవసం చేసుకుంటుందన్నారు.
పాలమూరు ఇంఛార్జిగా శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ నియోజకవర్గం తెరాస ఇంఛార్జిగా టిఎన్జీవో నేత శ్రీనివాస్ గౌడ్‌ను ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం నియమించారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ ఇంఛార్జిగా ఉన్న ఇబ్రహీంకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని కెసిఆర్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications