బాబుకు రమ్యశ్రీ 'చెక్', జీవిత రాజశేఖర్ నవ్వు(పిక్చర్స్)
హైదరాబాద్: కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రముఖ సినీ నటులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తున్నారు.
పలువురు కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి చెక్కులు అందజేస్తున్నారు.
శనివారం ప్రముఖ నటి రమ్యశ్రీ... చంద్రబాబు నాయుడును కలిసి లక్ష రూపాయల చెక్కును అందజేశారు. మరోవైపు హీరో రాజశేఖర్, దర్శక నిర్మాత జీవితలు చంద్రబాబును కలిసి అభినందనలు తెలిపారు.

రమ్యశ్రీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చంద్రబాబుకు విరాళాలు అందజేస్తున్నారని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. నటి రమ్యశ్రీ లక్ష రూపాయల చెక్కును చంద్రబాబుకు ఇచ్చారని చెప్పారు.

విరాళాలు
అనంతలక్ష్మి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ చైర్మన్ ఎం అనంతరాముడు రూ.50,016 చెక్ ఇచ్చారని, ఎపి మోటార్ వెహికిల్స్ ఇన్స్‌పెక్టర్స్ అండ్ టెక్నికల్ ఆఫీసర్ అసోసియేషన్ ఒకరోజు వేతనం విరాళంగా ప్రకటించినట్లు తెలిపారు. ఆలూరి లలిత రూ.20వేలు, భవిష్యవాణి వ్యవస్థాపకుడు,క ప్రముఖ జ్యోతిష్య పండితుడు నరసింహ చారి, విశ్లేషకురాలు ప్రియా చౌదరీలు చంద్రబాబును కలిసి స్వర్ణాంధ్ర నిర్మాణానికి తాము చేపట్టనున్న ప్రణాళికలను బాబుకు వివరించారు. తాము కోటిమందితో రామకోటి రాయించి తద్వారా వచ్చే ఆదాయాన్ని రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇస్తామని చెప్పారు.

రాజశేఖర్, జీవిత
విజయం సాధించిన టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు హీరో రాజశేఖర్, ఆయన సతీమణి, దర్శక నిర్మాత రాజశేఖర్‌లు శుభాకాంక్షలు తెలిపారు. నటి రమ్యశ్రీ కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

రాజశేఖర్, జీవిత
కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన రాజశేఖర్, జీవితలు ఆయనకు శాలువా కప్పి సన్మానించారు.

రాజశేఖర్, జీవిత
విజయం సాధించిన టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు హీరో రాజశేఖర్, ఆయన సతీమణి, దర్శక నిర్మాత రాజశేఖర్‌లు శుభాకాంక్షలు తెలిపారు.
-
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications