ఏపీ మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లు

Special Trains from Chennai Central: వేసవి సెలవుల్లో రైల్వేకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో.

ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

Ramzan and Summer Special Trains to run Santragachi from between Chnnai Central

తాజాగా దక్షిణ రైల్వే అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఏపీ మీదుగా చెన్నై సెంట్రల్ నుంచి సంత్రాగచ్చికి పలు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

ఈ నెల 26వ తేదీ వరకు ప్రతి బుధ, శనివారాల్లో చెన్నై సెంట్రల్ నుంచి రాత్రి 11:45 నిమిషాలకు బయలుదేరే నంబర్ 06077 నంబర్ రైలు సోమ, శుక్రవారాల్లో ఉదయం 7:15 నిమిషాలకు సంత్రాగచ్చికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 28వ తేదీ వరకు ప్రతి సోమ, శుక్రవారాల్లో సంత్రాగచ్చి నుంచి బయలుదేరే నంబర్ 06078 నంబర్ రైలు మంగళ, శనివారాల్లో చెన్నైకి చేరుకుంటుంది.

గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+