రజియా సుల్తానా కేసు: ఊడిన రంగనాథ్ గౌడ్ ఉద్యోగం

పోలీసు బాధ్యతలకు విరుద్ధంగా వ్యవహరించారని, అధికారాన్ని దుర్వినియోగం చేశారని గుర్తించి అతనిని ఉద్యోగం నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పొన్నూరులో ఎస్సైగా పని విధులు నిర్వర్తించిన సమయంలో తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని రంగనాథ్ గౌడ్ మోసం చేశారని రజియా సుల్తానా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పోలీసుల నుండి సరైన స్పందన లేకపోవడంతో గుంటూరులో మహిళా సంఘాల నేతలతో కలిసి ఆందోళన చేశారు.
రంగనాథ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని, తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని, కేసు నడుస్తుండగా సాక్ష్యాలు మాయం చేశారని రజియా సుల్తానా అప్పట్లో ఆరోపించారు. ఇప్పుడు రజియా సుల్తానా తన పంతం నెగ్గించుకున్నారు.
దాంతో ఉన్నతాధికారులు రంగనాథ్ గౌడ్ పైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ అనంతరం ఆయనపై వేటు వేశారు. పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యవహారంలో రంగనాథ్ కోర్టు కేసులు కూడా ఎదుర్కొన్నారు.












Click it and Unblock the Notifications