మత్తు మందిచ్చి మహిళ నగ్న ఫొటోలు తీసి రేప్, వేధింపులు: వైసీపీ నేతపై కేసు నమోదు

నెల్లూరు: మాయమాటలు చెప్పి తనను గర్భవతిని చేసి మోసం చేశాడని నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా డివిజన్ కో-ఆర్డినేటర్ కృష్ణారెడ్డిపై ఓ యువతి ఆరోపించింది. పోలీసులతోపాటు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది బాధితురాలు.

వివరాల్లోకి వెళితే.. వైసీపీ నేత కృష్ణారెడ్డి కడప జిల్లాకు చెందిన ఓ మహిళతో ఫేస్‌బుక్ ప్రేమ వ్యవహారం నడిపాడు. మహిళను కలవడానికి పిలిచి.. కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెను నగ్నంగా చేసి ఫొటోలు తీశాడు కృష్ణారెడ్డి. ఆ ఫొటోలు బయటపెడతానని బెదిరింపులకు గురిచేసి.. పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Rape and harassment case filed on nellore ysrcp leader krishna reddy

ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చడంతో.. గర్భం తీయించాడు కృష్ణారెడ్డి. ఆ తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఇద్దరికీ వివాహం చేశారు పెద్దలు. అయితే, ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బాధితురాలిని చిత్రహింసలకు గురిచేశాడు కృష్ణారెడ్డి. ఆమె హత్యకు కూడా ప్రయత్నించాడు.

ఈ క్రమంలో నిందితుడు కృష్ణారెడ్డిపై హైదరాబాద్‌లోనూ పోలీసులు కూడా నమోదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని బాధిత మహిళ మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సీ)ని ఆశ్రయించింది. ప్రస్తుతం వారి పర్యవేక్షణలోనే ఉంది.

Recommended Video

    కరోనా భారిన సోనియా - Get Well Soon

    కాగా, కృష్ణారెడ్డి అరాచకాలు తెలియడంతో వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ పదవి నుంచి ఆ పార్టీ అధిష్టానం తొలగించింది. కృష్ణారెడ్డి సొంత గ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+