మెడికో పైన అత్యాచారయత్నం, రెండో పెళ్లి చేసుకోబోతూ

బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలు బంజారాహిల్స్‌లోని 45 రోడ్డు నెంబర్‌లో ఓ పేయింగ్ గెస్టు హౌస్‌లో ఉంటూ పరీక్షలు రాస్తున్నారు. ఆమె జూన్ 1న హైదరాబాద్ వచ్చింది. సదరు యువకుడు అదే గెస్టు హౌస్‌లో హౌస్ కీపింగ్‌గా పని చేస్తున్నాడు.
నాలుగైదు రోజులుగా ఆమె గదిలోని బెడ్ షీట్లు మార్చడం వంటి పనులు చేశాడు. అతను ఆమెను మొదటి నుండి గమనిస్తున్నాడు. అతను ఆమెను అనుమానాస్పదంగా చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆమె నిద్రిస్తున్న సమయంలో అత్యాచారయత్నం చేశాడు. చుట్టుపక్కల వాళ్లు అతనిని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మరోవైపు షాక్‌కు గురైన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ఆమెను నగరంలోని బంధువుల ఇంటికి తరలించారు.
రెండో పెళ్లి చేసుకోబోతూ చిక్కాడు
డబ్బు కోసం రెండో పెళ్లి చేసుకోబోతూ ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. సనత్ నగర్‌కు చెందిన రవికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత నుంచి కట్నం కోసం భార్యను వేధిస్తుండేవాడు. ఆమె తరుచూ ఇంటి నుండి డబ్బులు తీసుకు వచ్చేది. ఈ నేపథ్యంలో మరింత కట్నం కోసం అతను మరో వివాహం చేసుకోబోయాడు. ఆ విషయాన్ని భార్య పోలీసులకు తెలియజేయడంతో వారు అతనిని పెళ్లి పీటల మీద అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications