జ్యోతిష్యం నేర్పిస్తా రా: రేప్, చేతబడి చేస్తానని!
జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం నేర్చుకోవడానికి శిక్షణ ఇస్తానని నమ్మించి ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుకు చెందిన మహిళ మీద అత్యాచారం చేసి పరారైన బెంగళూరులోని రాజరాజేశ్వరి నగరకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు .
కర్నూలు: జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం నేర్చుకోవడానికి శిక్షణ ఇస్తానని నమ్మించి మహిళ మీద అత్యాచారం చేసి పరారైన జోతిష్యుడిని బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర పోలీసులు తమిళనాడులో అరెస్టు చేశారు. ప్రముఖ జోతిష్యుడు ఆర్యవర్దన్ అనే నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తానని ఆర్య వర్దన్ ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసిన ఆంధ్రప్రదేశ్ లో ని కర్నూలుకు చెందిన ఓ మహిళ ఆర్యవర్దన్ ను సంప్రదించారు.
ఐదు రోజుల శిక్షణ ఇవ్వడానికి రూ. 24 వేలు ఫీజు చెల్లించాలని ఆర్యవర్దన్ చెప్పాడు. ఆ మహిళ రూ. 24 వేలు చెల్లించి శిక్షణ తీసుకున్నారు. తరువాత మరన్ని రోజులు శిక్షణ తీసుకోవాలంటే రూ. 1.50 లక్షలు అవుతుందని ఆర్యవర్దన్ ఆమెకు చెప్పాడు.

రూ. 1.50 లక్షలు ఆమె ఆర్యవర్దన్ కు ఇచ్చారు. జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రంలో మీరు తీసుకున్న శిక్షణ మీకు ఉపయోగపడకుంటే తీసుకున్న నగదు మొత్తం తిరిగి ఇస్తానని ఆర్యవర్దన్ ఆమెను నమ్మించాడు. చివరికి తూతూ మంత్రంగా శిక్షణ ఇచ్చి ఆమెను అక్కడి నుంచి పంపించేశాడు.
జ్యోతిష్యంలో ఆర్యవర్దన్ కు ఎలాంటి ప్రావీణ్యం లేదని గుర్తించి మోసం జరిగిందని ఆమె గ్రహించారు. డిసెంబర్ 12వ తేదిన ఆర్యవర్దన్ దగ్గరకు వెళ్లి ఏమిటి ఇలా జరిగిందని ఆమె ప్రశ్నించారు. ఆ సమయంలో ఆమె మీద ఆర్యవర్దన్ అత్యాచారం చేశాడు.
విషయం బయటకు చెబితే చేతబడి చేసి చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పరారైనాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పించుకు తిరుగుతూ తమిళనాడులో తలదాచుకున్న ఆర్యవర్దన్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications