ఏపీ టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాల్లో అరుదైన రికార్డు.. 600/600 మార్కులు
ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి ఫలితాల్లో ఓ విద్యార్థిని అరుదైన ఘనత సాధించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 600కి 600 మార్కులు పొందింది.
దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాకినాడకు చెందిన నేహాంజని అనే బాలికకు స్థానికంగా ఉన్న భాష్యం పాఠశాలలో బాలిక చదువుతోంది. 600/600 మార్కులు సాధించింది. దీంతో ఆ విద్యార్ధినిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు ఎలమంచిలి లోని చైతన్య స్కూల్‌లో చదువుతున్న ఎండ అనిత అనే విద్యార్థిని 599 మార్కులు సాధించింది. అదే విధంగా పల్నాడు జిల్లా ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న పావని చంద్రికకు 598 మార్కులు వచ్చాయి. దీంతో ఆమెను కూడా హెచ్‌ఎం విజయ లలిత, తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

ఈ ఫలితాల్లో 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో అబ్బాయిలు 78.31 శాతం, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణులయ్యారు. అలాగే 1,680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదు కాగా... పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. అలానే ఏపీలోని 1,680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా.. 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది.












Click it and Unblock the Notifications