పెద్దక్కది గట్టి గుండె!: ఆమె బతికి ఉండటం చూసి వైద్యులే షాక్ తిన్నారు..

పెద్దక్క గుండెకు రెండు గదుల మధ్యనున్న గోడ మీద కణితులు ఉన్నాయని తెలిపారు. టూడీ ఎకో, సిటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్షల్లో వాటిని గుర్తించినట్లు తెలిపారు.

కర్నూలు: గుండెలో 93 కణితులు పెట్టుకుని.. ఇంకా బతికి ఉన్న ఓ మహిళను చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నా.. ఆమె ప్రాణంతో ఉండటం పట్ల వారు విస్మయం వ్యక్తం చేశారు. చివరకు సర్జరీ ద్వారా ఆమె గుండెలోని కణితులను తొలగించి ప్రాణపాయం లేకుండా చేశారు.

కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు నగరంలోని వెంగన్నబావికి చెందిన పెద్దక్క(55) తరుచూ గుండెనొప్పితో బాధపడుతుండేది. ఇటీవల ప్రభుత్వాసుపత్రి వైద్యులను సంప్రదించి తన సమస్య గురించి చెప్పుకుంది. దీంతో పలు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆమె గుండెలో 93కణితలు ఉన్నట్లు గుర్తించారు.

 rare surgery performed on 65years old woman in kurnool

ఇన్ని కణితలు గుండెలో ఉన్న వ్యక్తి ఇంకా ప్రాణాలతో ఉండటం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైడియాట్రిక్ సిస్ట్ లు కలిగినవారు బతికి ఉండే కేసులు అరుదని వారు చెబుతున్నారు. కర్నూలు కార్డియోథోరాసిక్‌ విభాగం సీటీ సర్జన్‌ డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు మంగళవారం నాడు గుండె ఆపరేషన్ నిర్వహించారు. సర్జరీ ద్వారా వాటిని తొలగించారు.

సర్జరీ అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. పెద్దక్క గుండెకు రెండు గదుల మధ్యనున్న గోడ మీద కణితులు ఉన్నాయని తెలిపారు. టూడీ ఎకో, సిటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్షల్లో వాటిని గుర్తించినట్లు తెలిపారు. వీటి వల్ల రోగి ప్రాణపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని, ఇలాంటి కణితలు అరుదుగా వస్తాయని తెలిపారు.

కార్పోరేట్ ఆసుపత్రిలో అయితే ఈ సర్జరీకి రూ.3లక్షల దాకా ఖర్చయ్యేదని, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా సర్జరీ చేశామని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం పెద్దక్క ఆరోగ్యం కుదుటపడిందని, సంపూర్ణంగా కోలుకుంటోందని అన్నారు. గొర్రెల పెంపకం దారుల్లో ఇలాంటి కణితలు ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదముందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+