రిసార్టులు, రేవ్ పార్టీలపై దాడులు: 10మంది టెక్కీలు అరెస్ట్
హైదరాబాద్: రేవ్ పార్టీల పైన పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ అవి తగ్గడం లేదు. రంగారెడ్డి జిల్లా మొయినాబాదులోని ఓ ఫాంహౌస్ పైన పోలీసులు దాడి చేసి సుమారు 40 మందిని శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. అది మరవకముందే మరికొన్ని వెలుగు చూశాయి.
ఇదే మండలంలోని అప్పారెడ్డిగూడలోని ఫామ్ హౌస్‌లు, రిసార్టుల పైన పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 10 మంది సాఫ్టువేర్ ఇంజనీర్లను అరెస్టు చేశారు. హుక్కా సామాగ్రి, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నదీమ్ నగర్‌లో 21 మంది యువకులను అరెస్టు చేశారు.

ఏనుగుల బీభత్సం
చిత్తూరు జిల్లా వి కోట మండలం బీసీపల్లిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 12 ఏనుగులు పొలాల పైన దాడి చేసి దాదాపు 20 ఎకరాల్లోని మొక్కజొన్న, బీన్స్, బొప్పాయి, టమోటా తదితర పంటలను పూర్తిగా ధ్వంసం చేశాయి.
సముద్రంలో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపులిపాలెం వద్ద శనివారం నాడు సముద్రంలో గల్లంతైన విద్యార్థి మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. గూడురు పట్టణానికి చెందిన బాలాజీ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లి ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ రోజు సముద్రం వద్ద ఉన్న వంతెన సమీపంలో మృతదేహం లభ్యమైంది.
ప్రధానోపాధ్యాయుడిని నిర్బంధన
అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నంలో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పదో తరగతి పరీక్షా కేంద్రం మార్పును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన గ్రామస్థులు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని నిర్బంధించారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications