రేవ్ పార్టీ: పెద్ద మొత్తంలో చేతులు మారిన డబ్బు...!

హైదరాబాద్ శివారు ప్రాంతం రాజేంద్ర నగర్ పరిసరాల్లోని బాబుల్ రెడ్డి నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఓ రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది.
ఈ రేవ్ పార్టీ దాడిలో ఆరుగురు యువతులతో పాటు పలువరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులో ఉన్నవారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం.
ఆదివారం రాత్రే రేవ్ పార్టీపై దాడి చేసిన పోలీసులు మంగళవారం ఉదయం దాకా, బయటకు వెల్లడించ లేదు. మంగళవారం ఉదయం నిందితులను కోర్టు ముందు హాజరుపరిచినట్లు తెలుస్తోంది. ఐతే నిందితులను పోలీసులు అర్ధరాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరపరిచినట్లు తెలుస్తోంది.
వ్యవహారంలో పాత్ర ఉన్న బడాబాబులను కాపాడేందుకే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications