రేవ్ పార్టీలో అశ్లీల నృత్యాలు: యువతీయువకుల అరెస్ట్

హైదరాబాద్: రేవ్ పార్టీలో అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతీయువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌పై పోలీసులు దాడి చేసి సుమారు 40మందిని అరెస్ట్ చేశారు.

ఈ సంఘటనలో పదిమంది యువతులతోపాటు, 30మంది ఇంజినీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున మద్యంతోపాటు హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Rave party busted in Moinabad

ఇటీవల మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లలో తరచూ అశ్లీల నృత్యాలు తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీప్పవని ఫాంహౌస్ యాజమాన్యాలకు పోలీసులు హెచ్చరించారు.

కాగా, డిసెంబర్ 7వ తేదీన కూడా ఓ ఫాంహౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న రేవ్ పార్టీపై సైబరాబాద్ ఎఓటీ పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. అప్పుడు అర్థనగ్నంగా డ్యాన్సులు చేస్తున్న 8మంది ముంబై మోడల్స్, 22 మంది యువకులను అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+