టిడిపి నేత సంచలనం: 'కమ్మ వాళ్లకు పదవి ఇవ్వనని దేవుడిపై చంద్రబాబు ఓట్టు'
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన టిడిపి నేత, నరసాపురం పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు గురువారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన టిడిపి నేత, నరసాపురం పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు గురువారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నో చెప్పిన చంద్రబాబు
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి విషయమై ఆయన చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయపాటి టిటిడి చైర్మన్ పదవిని ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజాప్రతినిధులకు ఆ పదవి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.
Recommended Video


రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు
తాజాగా, టిటిడి చైర్మన్ పదవి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల కడప జిల్లా మైదుకురు నియోజకవర్గ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ పేరు వినిపించింది. అయితే, అది వివాదం కావడంతో దానిని పక్కన పెట్టారు. టిటిడి చైర్మన్ పదవిపై బాబు మనసులో ఏముందో ఎవరికీ తెలియడం లేదు. ఈ నేపథ్యంలో రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు ఇవ్వరు
ముఖ్యమంత్రి చంద్రబాబు టిటిడి ఛైర్మన్ పదవిని కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వరని రాయపాటి సాంబశివ రావు అన్నారు. టిటిడి ఛైర్మన్ పదవి వస్తుందని భావిస్తున్నారా? అని విలేకరులు ఆయనను అడిగారు. దానికి ఆయన పైవిధంగా సమాధానం చెప్పారు.

కమ్మ సామాజిక వర్గానికి పదవులివ్వనని దేవుడి ముందు ఓట్టు
కమ్మ సామాజిక వర్గానికి ఆ పదవి ఇవ్వనని దేవుడి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒట్టేసుకున్నారట అని ఒకింత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అనంతరం అక్కడి నుంచి నవ్వుతూ వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications