విభజనపై కలత: కాంగ్రెసుకు రాయపాటి సలాం?

ఈ స్థితిలో తాను తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితిలో లేనని రాయపాటి సాంబశివ రావు ఆంగ్ల దినపత్రికతో అన్నారు. తాను సీమాంధ్ర ప్రాంత భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నట్లు ఆయన చెప్పారు. సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని ఆయన చెప్పారు.
దమ్ముంటే తనపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఐదుగురు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులతో కలిసి ఆయన విభజనకు వ్యతిరేకంగా యుపిఎ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. పార్టీ మారిన తెలంగాణకు చెందిన మందా జగన్నాథం, జి. వివేక్, రాయలసీమకు చెందిన ఎస్పీవై రెడ్డిలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన అడుగుతున్నారు.
కాంగ్రెసు పార్టీ నుంచి గెలిచిన మందా జగన్నాథం, జి. వివేక్ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఎస్పీవై రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. రాయపాటి సాంబశివ రావు ఐదు సార్లు లోకసభకు గెలిచారు.












Click it and Unblock the Notifications