వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు షాక్: రాయపాటి రిజైన్, రాజ్యసభ మిస్ ఐనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

rayapati
గుంటూరు/హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత రాయపాటి శ్రీనివాస్ బుధవారం రాజీనామా చేశారు. గుంటూరు పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు బహిష్కరణకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నలభై ఏళ్ల పాటు పార్టీకి సేవలు చేస్తే సస్పెండ్ చేస్తారా అని మండిపడ్డారు. ఎంపీల సస్పెన్షన్ కాంగ్రెసు పార్టీకి ఆత్మహత్యాసాదృశ్యమే అన్నారు. రాయపాటి బహిష్కరణ కేడర్‌ను షాక్‌కు గురి చేసిందన్నారు.

కాంగ్రెసు అధిష్టానం ఎట్టకేలకు ఆరుగురు తిరుగుబాటు పార్లమెంటు సభ్యులపై కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడంతో పాటు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న ఆరుగురు లోకసభ సభ్యులపై కాంగ్రెసు అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది.

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సబ్బం హరి, హర్షకుమార్, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్‌లను కాంగ్రెసు అధిష్టానం బహిష్కరించింది. దాంతో వారు కాంగ్రెసు సభ్యులు కాకుండా పోతారు. తమను పార్టీ నుంచి మాత్రమే బహిష్కరించారని, పార్లమెంటు సభ్యులుగా కాదని రాయపాటి సాంబశివ రావు అన్నారు.

రాజ్యసభ మిస్ అయినా...

గవర్నర్ కోటాలో శాసన మండలికి కంతేటి సత్యనారాయణ, నంది ఎల్లయ్య, రత్నాబాయిలను ఎంపికయ్యారు. నాలుగు ఖాళీలు ఉండగా ముగ్గురిని ఎంపిక చేశారు. నంది ఎల్లయ్య, రత్నాబాయిలలో ఒక్కరిని రాజ్యసభకు పంపిస్తారని ఇటీవల ప్రచారం సాగింది. చివరి నిమిషంలో వారి పేర్లు ఖరారు కాలేదు. అయితే, ఇప్పుడు వారిద్దరు మండలికి వెళ్తున్నారు.

English summary

 Guntur senior leader Rayapati Srinivas Rao resigned from Congress Party on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X