యుపిఎపై అవిశ్వాసానికి 70 మంది మద్దతు: రాయపాటి

అవిశ్వాస తీర్మానానికి ఇతర పార్టీల నుంచి 70 మంది మద్దతు ఉందన్నారు. మద్దతు ఈసారి 100 నుంచి 150 వరకు పెరుగుతుందని ఆయన అన్నారు. విభజనపై బిజెపి స్వరం మారుతోందని, బిల్లు పెట్టే అవకాశం ఉండక పోవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనకు నిరసనగా మళ్లీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి సహా సీమాంధ్ర నేతలమంతా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తెలంగాణ బిల్లును ఆమోదించవద్దని కోరుతామని రాయపాటి చెప్పారు. రాష్ట్ర విభజనను రాయపాటి సాంబశివ రావు మొదటి నుంచీ వ్యతిరేకంగానే ఉన్నారి.
పార్లమెంటుకు పోటీ చేస్తే రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణకు మద్దతిస్తానని ఎంపి రాయపాటి వెల్లడించారు.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు లోకసభ స్థానం నుంచి కన్నా పోటీ చేస్తే తనకేమీ అభ్యంతరం లేదని ఆయన అన్నారు. తాను పోటీ నుంచి తప్పుకుని కన్నాకు మద్దతు ఇస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications