తెలంగాణలో 31 ఫైనాన్స్ సంస్థల నిషేధం: డిపాజిట్లు చేయొద్దన్న సిఐడి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 31 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలను రద్దు చేస్తూ రిజర్వు బ్యాంకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సిఐడి స్పందిస్తూ నిషేధిత సంస్థల్లో ఆర్థిక లావాదేవీలు జరపవద్దని ప్రజలకు సూచించింది.

అధిక వడ్డీ ఆశచూపి ఈ సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నాయని, ఈ సంస్థల్లో ఎవరూ డిపాజిట్లు చేయొద్దని సిఐడి కోరింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోనే ఎక్కువగా నిషేధిత సంస్థలు ఉన్నట్లు సిఐడి తెలిపింది.

telangana

ఆర్‌బిఐ మార్గదర్శకాల మేరకు అనుమతిలేని సంస్థల్లో డబ్బులు మదుపు చేయవద్దని, ఆర్థిక లావాదేవీలు జరపకూడదని ప్రజలను సిఐడి ఓ ప్రకటనలో కోరింది.

రిజర్వు బ్యాంక్ నిషేధించిన పలు సంస్థలు:
యుక్తా ఫైనాన్స్ లిమిటెడ్(పద్మారావునగర్, సికింద్రాబాద్)
ఎమర్జీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్(హకీంపేట్)
శ్రీ శ్రీహైర్ పర్చేస్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్(సీతాఫల్‌మండీ)
సిరి ఆటో ఫైనాన్షియర్స్ ప్రైవేట్ లిమిటెడ్(కొత్తగూడెం, ఖమ్మం)
మార్గదర్శి ఇన్వెస్ట్‌మెంట్ అండ్ లీజింగ్ కంపెనీ(హైదరాబాద్)
హెచ్‌సిజి ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇంపెక్స్ లిమిటెడ్(జీడిమెట్ల)
భవ్యా ఫైనాన్స్ లిమిటెడ్ (ఖార్ఖానా)
డిఎస్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ (సోమాజిగూడ, హైదరాబాద్)
బిఎన్ఆర్ ఉద్యోగ్ లిమిటెడ్ (సోమాజిగూడ, హైదరాబాద్)
నానో ఫైనాన్షియల్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(సోమాజిగూడ)
బాంబినో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్(సరూర్ నగర్, హైదరాబాద్)
జిఎన్ వాసవీ ఫైనాన్స్ లిమిటెడ్(పంజాగుట్ట, హైదరాబాద్)
శుభం ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్(బౌద్ధనగర్, హైదరాబాద్)
చెన్నై ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (హైదరాబాద్)
శ్రీ మహాలక్ష్మీ ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్(హైదరాబాద్)
మారుతి సెక్యూరిటీస్ లిమిటెడ్(సికింద్రాబాద్)
ప్రొద్దుటూరు ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్(తాడ్ బండ్)
మగ్నిల్ ఫైనాన్స్ అండ్ హైర్ పర్చేస్(హైదరాబాద్)
సూర్యలక్ష్మీ సెక్యూరిటీస్ (హైదరాబాద్)
శ్రీమాన్ సాయి సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్(జగిత్యాల)

వీటితోపాటు సిహల్ లీజింగ్, శ్రీగున్ లిఫిల్, లి., నానో ఫైనాన్స్ సర్వీస్, విక్రాంత్ ఇన్వెస్ట్ మెంట్స్,
సైకోల్ ఇన్వెస్ట్ మెంట్స్, తదితర సంస్థలపై ఆర్‌బిఐ నిషేధం విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+