రూ 500 నోట్లు రద్దు ఖాయమా - తేల్చేసిన ఆర్బీఐ..!!
రూ 2000 నోట్లు ఆర్బీఐ ఉపసంహరించుకుంది. ఇదే సమయంలో రూ 500 నోట్ల పైన పలు రకాల ప్రచారం కొనసాగుతోంది. రూ 500 నోట్లను కూడా రద్దు చేస్తారంటూ ఊహగానాలు మొదలయ్యాయి. రూ 2000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం తరువాత పెద్ద నోట్ల రద్దు వ్యవహారం పైన సామాన్యుల్లో అనేక సందేహాలు..చర్చలు మొదలయ్యాయి. రూ 2000 నోట్లను మార్చుకొనేందుకు సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ గడువుగా ప్రకటించింది. పెద్ద నోట్ల ఉపసంహరణ అంశం పైన ఆర్బీఐ ఇప్పుడు పూర్తి స్పష్టత ఇచ్చింది.
రూ 2000 నోట్ల రద్దు ఉపసంహరణ తరువాత రూ 500 నోట్ల రద్దుపైన చర్చ మొదలైంది. రూ 500 నోట్లను కూడా ఉప సంహరించకుతున్నారంటూ సోషల్ మీడియా వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ 500 నోట్లపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. రూ.500 నోట్లను సర్క్యూలేషన్ నుంచి ఉపసంహరించుకునే ఉద్దేశ్యమేమీ లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. రూ.500 నోట్లను వెనక్కి తీసుకుని రూ.1000 నోట్లను పున:ప్రవేశపెట్టాలనే ఆలోచనేమీ లేదన్నారు. రూ.2000 ఉపసంహరణ నేపథ్యంలో కొనసాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికారు. ఎవరూ ఇటువంటివి పరిగణలోకి తీసుకోవద్దని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసారు.

మే 19న ఆర్బీఐ రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటూ నిర్ణయం ప్రకటించింది. ఆ నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 డెడ్ లైన్ గా ఖరారు చేసింది. ఈ నోట్ల డిపాజిట్ పైన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక అంశాలను వెల్లడించారు. గడిచిన 20 రోజుల్లో రూ. 2 వేల నోట్ల డిపాజిట్లు గణనీయంగా పెరిగాయని తెలిపారు. కేవలం మూడు వారాల్లోనే 50 శాతం నోట్లు డిపాజిట్ (Deposite) అయినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఇప్పటివరకు మొత్తం చెలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లలో 85శాతం బ్యాంకు డిపాజిట్లుగా తిరిగి వచ్చినట్లు శక్తికాంత దాస్ ప్రకటించారు. మార్చి 31 వరకు చలామణిలో ఉన్న రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు.
చివరి వరకు నోట్ల మార్పు కోసం వేచి చూడవద్దని ఆర్బఐ గవర్నర్ సూచించారు. రద్దీని తగ్గించేందుకు ప్రజలు ముందుగానే రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు తగ్గట్టుగా సెంట్రల్ బ్యాంకు కరెన్సీ కలిగి ఉందని శక్తికాంత్ దాస్ తెలిపారు. అదే సమయంలో రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడం వంటి ఆలోచన లేదని స్పష్టం చేసారు. దీని ద్వారా ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంతో సామాన్యుల్లో నెలకొన్న అపోహాలు..సందేహాలకు ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications