వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ‌ళ్లీ ఎన్డీయే వైపుకు బాబు ప్ర‌య‌త్నం, కేంద్ర సాయం పై చ‌ర్చ‌కు సిద్దం : కొడుకు కోస‌మే..!

|
Google Oneindia TeluguNews

బిజెపి జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. చంద్ర‌బాబు ఎన్నిక‌ల త‌రువా త మ‌ళ్లీ ఎన్డీఏ వైపుకు వ‌స్తార‌ని..తాము త‌లుపులు మూసేస్తామ‌ని చెప్పారు. కేంద్రం పై అబ‌ద్దాలు చెబుతున్నారని ఏపి కి అందించిన సాయం పై చ‌ర్చ‌కు సిద్ద‌మ‌న్నారు. త‌న కుమారుడిని సీయం చేసేందుకే చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చే స్తుంటే...ప్ర‌జ‌లు అందుకు అంగీక‌రించ‌టం లేద‌ని దుయ్య‌బట్టారు.

ఎన్డీఏ వైపు బాబు వ‌స్తారు..
2019 ఎన్నికల తర్వాత.. మళ్లీ చంద్రబాబు ఎన్డీయేవైపు వచ్చేందుకు ప్రయత్నిస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమి త్‌ షా అన్నారు. విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన చంద్రబాబును మళ్లీ ఎన్డీయే వైపు రానివ్వమని, తలుపు లు మూసేస్తామని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో 14 అంశాల్లో 10 అంశాలను అమలు చేశామని ఆయన చెప్పారు. ఏపీకి ఎన్ని చేసినా.. ఏమీ చేయలేదని చెబుతూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అమిత్‌ షా విమర్శించారు. ఏ ఏ అంశాలపై తప్పుదోవ పట్టిస్తున్నారన్నది తర్వాత చెబుతానన్నారు. చంద్రబాబు గురించి తన కంటే ఏపీ ప్రజలకు ఎక్కువ తెలుసునని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కట్టారని, తెలం గాణలో ఓడిపోయాక ఫ్రంట్‌ అంటున్నారని అమిత్‌ షా విమర్శించారు. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తుందని అమిత్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో 20కి పైగా విద్యా సంస్థలను ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర సాయం పై చ‌ర్చ‌కు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు.

Ready for Discussion Central Assistance : Amit Shah Challenge to Babu

టిడిపి-వైసిపి అవినీతి పార్టీలు..
ఏపిలోని టిడిపి..వైసిపి రెండు కుటుంబ-అవినీతి పార్టీల‌ని అమిత్ షా విమ‌ర్శించారు. అమ‌రావ‌తి లో జ‌రుగుతున్న అవినీతిని క‌ప్పిపుచ్చ‌టానికి సెంటిమెంట్ ఎత్తుకున్నార‌ని ఆరోపించారు. గత కాంగ్రెస్ హయాంలో ఐదేళ్లలో లక్షా పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇస్తే, మోడీ ప్రభుత్వం రెండు లక్షల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆయన అన్నారు.అంతేకాక రెవెన్యూ లోటు కింద డబ్బులు ఇచ్చామని ఆయన అన్నారు.వివిధ పదకాల కింద అన్ని లెక్కలు కలిపి ఎపికి 5.56 లక్షల కోట్ల రూపాయలు ఎపికి ఇవ్వడం జరిగిందని షా వెల్లడించారు. త‌న కుమారుడిని ఏపి సీయం గా చేయ‌టం కోస‌మే చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని..అయితే అందుకు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు లేద‌ని షా వివ‌రించారు. ప్ర‌తీ కార్య‌క‌ర్త ఇంటింటికి వెళ్లి కేంద్రం ఏపికి చేసిన సాయాన్ని వివ‌రించాల‌ని పిలుపునిచ్చారు.

English summary
BJP Chief Amit Shah Seriously reacted on AP Cm Chandra babu recent comments on Central Govt and on PM Modi. Sha says Central Govt given more than allocated funds to AP. He says is ready for discussion central assistance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X