Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Amaravati: అమరావతిలో అనూహ్య పరిణామం! ఎన్నికల వేళ కీలక సంకేతం?

ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిలో మరోసారి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చాక ఇక్కడి పరిస్దితులు అనూహ్యంగా మారిపోయాయి.తిరిగి నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ పరిస్ధితుల్లో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా రాజధాని మార్పు కారణంగా కుదేలైన రియల్ ఎస్టేట్ రంగానికి తిరిగి రెక్కలు వచ్చేలా ఉంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు రాష్ట్రంలో చర్చకు దారి తీస్తున్నాయి.

గతంలో అమరావతి స్ధానంలో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చాక ఇక్కడి పరిస్ధితులు వేగంగా మారిపోయాయి. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. గతంలో రాజధాని వస్తుందని భావించి వేలం వెర్రిగా ఇక్కడ ఫ్లాట్లు, అపార్ట్ మెంట్లు కొన్న వారంతా ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. వాటిని అందిన కాడికి అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. అయినా తగిన రేట్లు రాక ఇంకా తమ ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. అలాంటి వారికి ఊరటనిచ్చేలా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

real estate boom again in amaravati capital ahead of ap elections-will it be an indication?

అమరావతిలో కొన్ని నెలలుగా తిరిగి ఫ్లాట్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నివాస, వాణిజ్య ఫ్లాట్ల కోసం ఎంక్వైరీలు పెరిగాయి. నివాస ఫ్లాట్ల ధర గతంలో కంటే 5 వేల వరకూ పెరిగినట్లు తెలుస్తోంది. అలాగే వాణిజ్య ఫ్లాట్లు సైతం 10 వేల వరకూ పెరిగాయని చెబుతున్నారు. సచివాలయం ఉన్న వెలగపూడిలో ప్రస్తుతం వాణిజ్య ఫ్లాటు ధర గజం 35 వేల వరకూ పలుకుతోంది. ఇది ఈ రెండు, మూడు నెలల్లో మరింత పెరగవచ్చని చెబుతున్నారు.

రాష్ట్రంలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ దాన్ని అమలు చేయడంలో మాత్రం విఫలమైంది. ముఖ్యంగా హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం వేగంగా ముందడుగు వేసే పరిస్దితులు లేకుండా పోయాయి. వైజాగ్ కు తరలివెళ్లేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్న ప్రస్తుతం హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు అమల్లో ఉన్నాయి. దీంతో ఎన్నికలకు ముందు రాజధాని మార్పు ఉండకపోవచ్చనే ప్రచారంతో అమరావతిలో ఫ్లాట్ల ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో అధికార, విపక్షాలు ఇచ్చే హామీల ప్రభావం కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసేలా కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+