రియల్ హీరోస్ వీళ్లే.. 10 మందిని కాపాడి, ఆరుగురిని ఆస్పత్రికి !!

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంతో ఎన్నో కుటుంబాలు తీరని శోకంలో మునిగిపోయాయి. ఈ దారుణ ఘటనలో ఒక బైకర్‌తో సహా 20 మందికి ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ 12 మందికి కర్నూలు సర్వజన ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా బస్సు రాత్రి 10 గంటలకి హైదరాబాద్ నుంచి బయలుదేరింది. తెల్లవారుజామున 2:14కి తెలంగాణ సరిహద్దులోని పులూరు టోల్ ప్లాజా చేరింది. 3:30 ప్రాంతంలో కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద ప్రమాదం జరిగింది. బస్సు బైక్‌ను ఢీ కొట్టి దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లింది. ఆ క్రమంలోనే మంటలు చెలరేగి ఈ ఘోరం జరిగింది. అయితే బస్సులో ఉన్న వందలాది మొబైల్ ఫోన్ల పార్సిల్ ఈ ప్రమాద తీవ్రతను పెంచినట్లు గుర్తించారు.

real-heros-in-kurnool-bus-accident-who-saves-victims

బాధితులను ఆదుకున్న రియల్ హీరోలు వీళ్లే..

అయితే ఈ దుర్ఘటనలో శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన హరీశ్‌కుమార్‌రాజు సమయస్ఫూర్తితో స్పందించి పది మంది ప్రాణాలు కాపాడారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఈ యువకుడు హైదరాబాద్‌ వెళ్లి తిరిగి గురువారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో బెంగళూరుకు బయలుదేరారు. ఆ సమయంలోనే బస్సు ప్రమాదాన్ని గమనించి రాయితో కుడివైపు అద్దాన్ని పగులగొట్టారు. ఆ విధంగా బస్సు లోపల ఉన్న పదిమంది ప్రయాణికులు బయటకు రాగలిగారని తెలిపారు.

అలానే బస్సు నుంచి బయటపడిన వారిలో ఆరుగురికి గాయాలు కావడంతో హరీశ్‌ తన స్నేహితుల సహకారంతో అటుగా వస్తున్న ఓ కారు యజమానిని ఆపారు. సదరు కారు డ్రైవరు నవీన్‌ నంద్యాలకు వెళుతూ ప్రమాదాన్ని గమనించి కారును ఆపినట్టు తెలుస్తోంది. ప్రయాణికులను రక్షించేందుకు తనవంతు కృషిగా.. బయటపడిన వారిలో తీవ్ర అస్వస్థతకు ఆరుగురిని తన వాహనంలో ఎక్కించుకుని హుటాహుటిన కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడారు.

real-heros-in-kurnool-bus-accident-who-saves-victims

వీరితో పాటు మరో ప్రత్యక్ష సాక్షి అటుగా వెళ్తూ ప్రమాదానికి సంబంధించిన వీడియోను తీసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. తాను పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తూ ఈ ప్రమాదాన్ని చూశానని.. బస్సు మంటల్లో కాలిపోతుండగా.. కొందరు బయటకు దూకారన్నారు. సీట్లలో మానవ ముద్దలు, అస్థిపంజరాలు కనిపించాయని.. అది చూసి తట్టుకోలేకపోయానని వాపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+