తుఫాన్ కష్ట సమయంలో ఏపీ గ్రామ సచివాలయాలు ఇలా ఉపయోగపడుతున్నాయ్

బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాన్ మొంథా.. మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ భీతావహంగా మారుతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్.. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. తీరాన్ని దాటుతున్న సమయంలో అంచనాలకు అందని విధంగా బీభత్సాన్ని సృష్టించే అవకాశాలు లేకపోలేదు. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకూ అతి భారీ వర్షాలకు కారణమౌతోంది.

ప్రస్తుతం ఈ మొంథా తుఫాన్ బంగాళాఖాతం మచిలీపట్నానికి 230, కాకినాడకు 310, విశాఖపట్నానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ తీరం వైపు కదులుతోంది. ఈ రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ తుఫాన్ చేరువ అవుతున్న కొద్దీ మహోగ్రంగా మారుతూ కనిపిస్తోంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. తీరాన్ని దాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.

Real-Time Voice Messages Amid Cyclone Montha in Andhra Pradesh

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఇదే తీవ్రత మరో రేపు కూడా కొనసాగనుంది. నేటి నుంచి పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తాయి.

కాపులుప్పాడలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 125 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. విశాఖ రూరల్- 120, ఆనందపురం- 117 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 86 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మొత్తం 233 మండలాల పరిధిలోని 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపై తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉండబోతోందని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 2,194 పునరావాస శిబిరాలు ఏర్పాటయ్యాయి.

తుపాను కదలికలు, దీనికి సంబంధించిన ఇతర వివరాలను ప్రజలకు తెలియజేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా- రియల్‌టైమ్ వాయిస్ అలర్ట్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కోస్తా జిల్లాల్లోని 26 తీర ప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా మొంథా తుపాన్ హెచ్చరికలు రియల్‌టైమ్ వాయిస్ అలర్ట్‌లను క్షణాల్లో అందిస్తోన్నారు అధికారులు. తుపాన్ ప్రభావం అత్యధికంగా ఉండే తీర ప్రాంత గ్రామాలు కావడం వల్ల ఈ రియల్ టైమ్ వాయిస్ అలర్ట్ ను అక్కడే ఏర్పాటు చేశారు. 2,000 మంది ప్రజలు ఉండే ప్రతి గ్రామం/వార్డుల్లో నిర్మితమైన సచివాలయాల భవనాలపై మైక్ లను అమర్చి.. ఈ రియల్ టైమ్ వాయిస్ అలర్ట్ ను ప్రజలకు చేరవేస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+