Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాజీ ఎయిర్‌హోస్టెస్: టాయిలెట్ క్లీనర్ తాగేసి... ఎందుకు?

చిత్తూరు సబ్‌ జైలులో రిమాండు ఖైదీగా వున్న ఎర్రచందనం స్మగ్లర్‌, మాజీ ఎయిర్‌ హోస్టెస్‌ సంగీతా ఛటర్జీ గురువారం మధ్యాహ్నం ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన తీవ్ర సంచలనం రేపింది.

చిత్తూరు: చిత్తూరు సబ్‌ జైలులో రిమాండు ఖైదీగా వున్న ఎర్రచందనం స్మగ్లర్‌, మాజీ ఎయిర్‌ హోస్టెస్‌ సంగీతా ఛటర్జీ గురువారం మధ్యాహ్నం ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన తీవ్ర సంచలనం రేపింది. ఐదు నెలలుగా రిమాండు ఖైదీగా జైలులో ఉంటోంది.

బెయిలు రాకపోవడం, దక్షిణాది ఆహారం సరిపడకపోవడం వంటి కారణాలతో ఆమె తీవ్ర నిస్పృహకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో సబ్‌ జైలులోని టాయిలెట్‌ క్లీనర్‌ తాగేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. దీంతో ఆమెను జైలు సిబ్బంది చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు.

ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా సుపత్రికి తరలించారు. కోల్‌కతాకు చెందిన సంగీతా ఛటర్జీ గతంలో ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేసేది. చెన్నైకి చెందిన ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్‌ మార్కొండన్‌ లక్ష్మణ్‌ విమాన ప్రయాణ సందర్భాల్లో ఆమెతో పరిచయం పెంచుకోవడంంతో ఆమె జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది..

భర్తకు విడాకులిచ్చి...

భర్తకు విడాకులిచ్చి...

లక్ష్మణ్‌తో పరిచయం పెరిగి ప్రేమకు దారి తీసింది. దీంతో సంగీతా ఛటర్జీ తన భర్తకు విడాకులిచ్చి 2013లో లక్ష్మణ్‌ను వివాహం చేసుకుంది. 2015లో చిత్తూరు పోలీసులు లక్ష్మణ్‌ను అరెస్టు చేసి అతనిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచీ అతను కడప సెంట్రల్‌ జైలులో రిమాండులో వుంటున్నారు.

లక్ష్మణ్ అరెస్టు తర్వాత...

లక్ష్మణ్ అరెస్టు తర్వాత...

లక్ష్మణ్‌ అరెస్టయిన తర్వాత అతని తరపున ఎర్రచందనం అక్రమ రవాణా, నగదు లావాదేవీలన్నీ సంగీతా ఛటర్జీయే నిర్వహిస్తూ వచ్చింది. చిత్తూరు జిల్లాలోని కల్లూరు పోలీసు స్టేషన్‌లో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి నమోదైన ఓ కేసులో అరెస్టయిన నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమెపై యాదమరి, కల్లూరు, నిండ్ర పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. నిరుడు పోలీసులు కోల్‌కతా వెళ్ళి ఆమెను అరెస్టు చేశారు.

ఇలా జరిగింది....

ఇలా జరిగింది....

తనను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టడంతో అనారోగ్యం సాకు చూపి సంగీత బెయిల్‌ తీసుకుంది. ఆ తర్వాత జిల్లాలోని కేసుల కోర్టు విచారణలకు హాజరు కాలేదు. దాంతో పాకాల కోర్టు రెండు పర్యాయాలు అరెస్టు వారెంట్లు కూడా జారీ చేసింది. ఈ వారెంట్ల అమలు కోసం ఆమె ఆచూకీ కనిపెట్టి ఈ ఏడాది మార్చి మూడవ వారంలో కోల్‌కతా బయల్దేరి వెళ్ళి వారం రోజుల పాటు నిఘా వుంచి అదే నెల 28వ తేదీ మంగళవారం ఓ పబ్‌లో వుండగా అదుపులోకి తీసుకున్నారు. పాకాల కోర్టు మెజిస్ట్రేట్‌ నివాసం వద్ద హాజరుపరచగా మెజిస్ట్రేట్‌ 14 రోజుల పాటు రిమాండు విధించారు. దాంతో సంగీతా ఛటర్జీని చిత్తూరు సబ్‌ జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉంటోంది.

అలా వెళ్లిన సంగీత

అలా వెళ్లిన సంగీత

గురువారం మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో సంగీత మహిళా సిబ్బందికి సంబంధించిన టాయిలెట్‌కు వెళ్లింది. అందులో వున్న టాయిలెట్‌ క్లీన్‌ చేసే కెమికల్‌ను తాగేసింది. టాయిలెట్ల వద్దే వాంతులు చేసుకోవడంతో గుర్తించిన సబ్‌జైలు మహిళా సిబ్బంది అధికారులకు విషయం చెప్పారు. దాంతో అధికారులు వెంటనే ఆమెను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిరాశా నిస్పృహలతోనే సంగీతా ఛటర్జీ ఆత్మహత్యకు యత్నించినట్టు తెలిసింది. ఆ మేరకు ఆమె నుంచీ పోలీసులు స్టేట్‌మెంట్‌ నమోదు చేశారు. తొలుత బెయిలు త్వరగానే వస్తుందని అనుకున్నట్లు, అయితే ఐదునెలలు గడుస్తున్నా బెయిలు రాకపోవడంతో తాను మానసికంగా కృంగిపోయినట్లు ఆమె పోలీసులతో చెప్పింది. ఉత్తరాది వంటకాలకు అలవాటు పడిన తనకు దక్షిణాది ఆహార పదార్థాలు సరిపడలేదని కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+