ఇన్ని రోజులు ఆముగ్గురు ఎమ్మెల్యేలు జై జగన్, ఇప్పుడు ఒకే ఊర్లో ఆ ముగ్గురు మూడు లోకాలు, అంతేగా !
తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఎంపీ, గూడురు వైసీపీ సిట్టింగ్ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ రావు పోటీ చేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం టక్కెట్ పై తిరుపతి ఎంపీగా పోటీ చేసిన వరప్రసాద్ రావు ఓడిపోయారు. 2014లో వైసీపీ టిక్కెట్ పై అదే తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసిన వరప్రసాద్ రావ్ ఎంపీగా విజయం సాధించారు. తరువాత 2019లో గూడురు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వైసీపీ టిక్కెట్ మీద పోటీ చేసిన వరప్రసాద్ ఎమ్మెల్యే అయ్యారు.
అయితే ప్రస్తుతం వైసీపీ టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో వరప్రసాద్ రావ్ ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసి చర్చలు జరిపారు, గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ రావ్ జనసేనలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే తెర వెనుక జరిగిన చర్చల్లో భాగంగా గత ఆదివారం వరప్రసాద్ రావ్ బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన మరుసటి రోజే వరప్రసాద్ రావ్ కు తిరుపతి ఎంపీ సీటు ఇచ్చిన బీజేపీ ఆయన్న రంగంలోకి దింపింది.

గతంలో తిరుపతి ఎంపీగా పని చేసిన వరప్రసాద్ రావ్ కు తిరుపతి లోక్ సభ నియోజక వర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. తమిళనాడులో ఐఏఎస్ అధికారి హోదాలో మంచి ఉన్నత పదవులు చేపట్టి పరిపాలన పరంగా మంచి అనుభవం ఉన్న విద్యావంతుడు వరప్రసాద్ రావ్ కచ్చితంగా తిరుపతిలో మరోసారి ఎంపీగా విజయం సాధిస్తారని బీజేపీ నాయకులు ధీమాగా చెబుతున్నారు. అయితే తిరుపతి ఎంపీ ఎవరు అనే విషయం జూన్ 4వ తేదీన తేలనుంది.
ఇక తిరుపతిలో జనసేన టిక్కెట్ తో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జంగాలపల్లె శ్రీనివాసులు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం ఇక్కడ విశేషం. 1989లో జంగాలపల్లె సర్పెంచ్ గా విజయం సాధించిన జంగాలపల్లె శ్రీనివాసులు తరువాత మండలాధ్యక్షుడిగా పని చేశారు. 1995లో యాదమరి జడ్పీటీసీగా విజయం సాధించి చిత్తూరు జిల్లా పరిషత్ లో విప్ గా పని చేశాడు. తరువాత తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగా పాల్గొంటున్న జంగాలపల్లె శ్రీనివాసులు నారా చంద్రబాబు నాయుడికి దగ్గర అయ్యారు.
2004లో చిత్తూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జంగాలపల్లె శ్రీనివాసులు సీకే బాబు చేతిలో ఓడిపోయారు. తరువాత టీడీపీ గుడ్ బాయ్ చెప్పిన జంగాలపల్లె శ్రీనివాసులు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో ఆ పార్టీ టిక్కెట్ దక్కించుకుని చిత్తూరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న జంగాలపల్లె శ్రీనివాసులు తరువాత వైసీపీలో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అప్పటి నుంచి వైసీపీలోనే ఉన్న జంగాలపల్లె శ్రీనివాసులకు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు నుంచి పోటీ చెయ్యడానికి మరో అవకాశం రావడంతో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2024 అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడానికి వైసీపీ నిరాకరించడంతో వైసీపీ ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు జనసేనలో చేరారు. తిరుపతి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న జంగాలపల్లె శ్రీనివాసులకు ఇప్పుడు అదే తిరుపతిలో ఎదురుగాలి వీస్తోంది.

ఎమ్మెల్యే టిక్కెట్ స్థానిక నాయకులకే ఇవ్వాలని తిరుపతి జనసేన నాయకులు ఆందోళనకు దిగడంతో వారితో ఇప్పటికే పవన్ కల్యాణ్ సోదరుడు నాగేంద్ర బాబు చర్చలు జరిపి వాళ్లకు నచ్చచెప్పారు. జంగాలపల్లె శ్రీనివాసుల కోసం పని చెయ్యాలని, తరువాత పవన్ కల్యాణ్ తో మాట్లాడి మీకే వేరే పదవులు ఇప్పిస్తానని నాగేంద్ర బాబు తిరుపతికి చెందిన జనసేన నాయకులకు హామీ ఇచ్చారు.
అయితే తిరుపతిలోని జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు మాత్రం జంగాలపల్లె శ్రీనివాసులకు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఇక ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకపోవడంతో బహిరంగంగానే నిరసనలు వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే సుగణమ్మ తీరుపై నారా చంద్రబాబు నాయకుడు మండిపడ్డారు. పద్దతి మార్చుకోకపోతే పార్టీ నుంచి బయటకు పంపిస్తామని సుగణమ్మను చంద్రబాబు హెచ్చరించారని తెలిసింది.
రాజకీయ అనుభవం ఉన్న జంగాలపల్లె శ్రీనివాసులు స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ గా పని చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన టిక్కెట్ పై తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జంగాలపల్లె శ్రీనివాసులు నాన్ లోకల్ అని ఇప్పటికే వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే తాను పక్కనే ఉన్న చిత్తూరు నుంచి వచ్చానని, తనకు చిత్తూరు, తిరుపతి రెండు కళ్లులాంటివి అంటూ జంగాలపల్లె శ్రీనివాసులు స్థానికులకు చెబుతున్నారు.
ఇక తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడ అభినయ్ రెడ్డి గెలుపు కోసం పగలు, రాత్రి అని తేడాలేకుండా కష్టపడి పని చేస్తున్నారు. అయితే తిరుపతిల విచిత్రం ఏమిటంటే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వేర్వేరు పార్టీ టిక్కెట్ లతో ఎంపీగా ఒకరు, ఎమ్మెల్యేగా ఒకరు పోటీ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ఇక్కడ వైసీపీ అభ్యర్థి.
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి, వరప్రసాద్ రావ్, జంగాలపల్లె శ్రీనివాసులు వైసీపీ టిక్కెట్ మీద వేర్వేరు నియోజక వర్గాల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు అదే వైసీపీ అభ్యర్థికి ఇద్దరు నాయకులు తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డికి గట్టిపోటీ ఇస్తున్నారు. నెల రోజుల క్రితం వైసీపీ కండువా వేసుకున్న ముగ్గురు నాయకులు ఇప్పుడు తిరుపతిలో మూడు వేర్వేరు కండువాలు వేసుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications