న్యూయార్క్ లో ప్రభాస్ కు సర్జరీ.. 1 సంవత్సరం సినిమాలకు దూరం?
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా షూటింగ్ లకు ఏడాది సమయం విరామం ఇవ్వబోతున్నారు. దీనికి కారణం.. న్యూయార్క్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోబోతున్నారు. సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కేవలం 21 సినిమాల్లో మాత్రమే నటించిన ప్రభాస్ ఇటీవలి కాలంలో కంటిన్యూగా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. దీనివల్ల మోకాలు నొప్పి చేసినట్లు తెలుస్తోంది.
ఎక్కువ గ్యాప్ లేకుండా తక్కువ వ్యవధిలోనే సినిమాలు విడుదల చేయాలనే ఉద్దేశంలో ఉన్న ప్రభాస్ నిర్విరామంగా సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే ఆదిపురుష్ పూర్తిచేసి విడుదల చేశారు. దీని తర్వాత సలార్ సెప్టెంబరు 28వ తేదీన, కల్కి 2898 2024 సంక్రాంతిరోజు విడుదల కానున్నాయి. అందుకు తగ్గ ప్రణాళికలు కూడా నిర్మాతలు పూర్తిచేశారు. దీంతో నిరంతరాయంగా షూటింగ్స లో పాల్గొనడంవల్ల అనారోగ్యానికి గురయ్యారు.

సర్జరీ చేయించుకున్న తర్వాత ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా పెండింగ్ లో ఉన్న సలార్, కల్కి చిత్రాల షూటింగ్స్ పూర్తిచేయబోతున్నారు. వీటి తర్వాత మారుతి దర్శకత్వంలో చేస్తున్న చిత్రం, సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది.
షూటింగ్ లకు దూరమైతే ఈ మూడు చిత్రాల విడుదల కూడా ఆలస్యం కానుందని చెబుతున్నారు. ఏదైనప్పటికీ ఆయా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించేంతవరకు అవి ఎప్పుడు పూర్తవుతాయి? ఎప్పుడు విడుదలవుతాయి? అనే విషయంలో కాస్తంత ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications