ఏపీ, చెన్నై చర్చిద్దాం: వెంకయ్య, రజనీకాంత్ సహా నటుల సాయం, రంగంలోకి సిద్దార్థ

ఢిల్లీ/చెన్నై: భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిపై చర్చిద్దామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పార్లమెంటులో చెప్పారు. బుధవారం

ఐదో రోజు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమ్యాయి.

సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీనిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. చెన్నై, ఏపీలో వరదపరిస్థితిపై చర్చ చేపడదామని విపక్షాలకు సూచించారు.

ఇరవై అయిదు రోజులుగా చెన్నై నీటిలోనే ఉందన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, రైళ్లు రద్దవడంతో వేలాదిమంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయన్నారు.

Record breaking December for Chennai Rains

వాయిదా తీర్మానంపై స్పీకర్‌‌దే అంతిమ నిర్ణయమన్నారు. కాగా, సభాపతి సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు.

తమిళనాడుకు సినీ నటుల వరద సాయం

తమిళనాడు రాష్ట్రానికి సినీ నటుడు రజనీకాంత్ వరద సాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని రజనీకి చెందిన శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందివ్వనున్నట్టు ప్రకటించారు.

రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ రూ.5 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించారు. నటులు సూర్య, కార్తీ రూ.25 లక్షలు, విశాల్ రూ.10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో తమిళనాడులో చాలా ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే.

నటుడు సిద్ధార్థ, డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ వంటి వారు చెన్నైలో సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎవరైనా ఫుడ్ ప్యాకెట్లు పంపిస్తే తమకు అందివ్వాలని, తమ బ్యాచ్ బాధితులకు అందిస్తుందని సిద్ధార్థ్ పేర్కొన్నారు. కేవలం రైస్ ఐటమ్స్ పంపించాలని సూచించారు. అలాగే, తమకు కార్లు కావాలని, ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+