ఎర్ర చందనం స్మగ్లర్, మోడల్ సంగీతా చటర్జీ ఆత్మహత్యాయత్నం
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న మోడల్ సంగీతా చటర్జీ ఆథ్మహత్యాయత్నం చేసింది. ఆమె చిత్తూరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది.
చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న మోడల్ సంగీతా చటర్జీ ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె చిత్తూరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది.
ఆమె విషపు బిల్లలు మింగింది. దీనిని గుర్తించిన జైలు సిబ్బంది ఆమెను హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బెయిల్ రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందిందని తెలుస్తోంది.

కోల్‌కతాకు చెందిన సంగీతను ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించిన సంగీత తర్వాత మోడల్‌గానూ కొనసాగారు.
తర్వాత బడా స్మగ్లర్ లక్ష్మణ్‌తో పరిచయం వివాహానికి దారితీసింది. లక్ష్మణ్‌తో తోడుగా సంగీత కూడా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడింది. దీంతో చిత్తూరు జిల్లాలో ఆమెపై నాలుగు కేసులు నమోదయ్యాయి.
పోలీసులు కోల్‌కతాలో ఆమెపై నిఘా పెట్టి పక్కా ప్రణాళికతో అరెస్ట్ చేసి చిత్తూరు తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో అప్పటి నుంచి ఆమె చిత్తూరు సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications