ఎర్రచందనం అక్రమ రవాణా:కూలీలు అరెస్టు(ఫోటోలు)
హైదరాబాద్: శ్రీకాళహస్తి, ఏర్పేడు ప్రాంతాల్లో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న తమిళనాడుకు చెందిన 27 మంది కూలీలను ఎస్టీఎఫ్ బలగాలు దాడి చేసి అరెస్ట్ చేసినట్లు క్రైమ్ అదనపు ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు.
గురువారం అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల వివరాలను వెల్లడించారు. శ్రీకాళహస్తి సమీపంలో కాషాగార్డెన్ సమీపంలో కూలీలు ఎర్రచందనం తరలిస్తుండగా ఎస్టీఎప్ బలగాలు దాడి చేశాయి.
12 మంది కూలీలను అదుపులోకి తీసుకుని 15 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఏర్పేడు వద్ద అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 15 మంది కూలీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
వీటితోపాటు ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగించే ఇన్నోవా వాహనాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 30 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. వీరిని అరెస్ట్ చేయడంలో ఏఆర్ డీఎస్పీ ఇలియాన్ బాషా, ఆర్ ఎస్ఐ భాస్కర్, ఎస్టీఎప్ బలగాలు పాల్గొన్నట్లు వెల్లడించారు.

ఎర్రచందనం అక్రమ రవాణా: 27 మంది కూలీలు అరెస్టు
శ్రీకాళహస్తి, ఏర్పేడు ప్రాంతాల్లో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న తమిళనాడుకు చెందిన 27 మంది కూలీలను ఎస్టీఎఫ్ బలగాలు దాడి చేసి అరెస్ట్ చేసినట్లు క్రైమ్ అదనపు ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఎర్రచందనం అక్రమ రవాణా: 27 మంది కూలీలు అరెస్టు
గురువారం అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల వివరాలను వెల్లడించారు. శ్రీకాళహస్తి సమీపంలో కాషాగార్డెన్ సమీపంలో కూలీలు ఎర్రచందనం తరలిస్తుండగా ఎస్టీఎప్ బలగాలు దాడి చేశాయి.

ఎర్రచందనం అక్రమ రవాణా: 27 మంది కూలీలు అరెస్టు
వీటితోపాటు ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగించే ఇన్నోవా వాహనాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 30 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.

ఎర్రచందనం అక్రమ రవాణా: 27 మంది కూలీలు అరెస్టు
12 మంది కూలీలను అదుపులోకి తీసుకుని 15 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఏర్పేడు వద్ద అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 15 మంది కూలీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణా: 27 మంది కూలీలు అరెస్టు
వీరిని అరెస్ట్ చేయడంలో ఏఆర్ డీఎస్పీ ఇలియాన్ బాషా, ఆర్ ఎస్ఐ భాస్కర్, ఎస్టీఎప్ బలగాలు పాల్గొన్నట్లు వెల్లడించారు.

Click it and Unblock the Notifications