ఘరానా దొంగ కాల్పులు: ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
అనంతపురం/ చిత్తూరు: ఫాంహౌస్‌లో దోపిడీకి యత్నించిన అంతర్రాష్ట్ర నేరగాడు పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. ఈ కాల్పుల్లో ఎస్‌ఐ సహా నలుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. అనంతపురం జిల్లా హిందూపురంలో నివాసం ఉంటూ కర్నాటక, ఆంధ్ర తదితర ప్రాంతాల్లో దారి దోపిడీలు, హత్యలు, చోరీలకు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ నేరగాడు దుర్గా అలియాస్ దుర్గాప్రసాద్ బుధవారం అర్ధరాత్రి కర్నాటకలోని గౌరిబిదనూరు సమీపంలో పోలీసులపై తెగబడ్డాడు.
ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - గౌరిబిదనూరు సమీపంలోని ముద్దగానికుంట వద్ద ఉన్న బెంగళూరు దేవనహళ్లికి చెందిన బలరాం ఫాంహౌస్‌లో దోపిడీ బుధవారం అర్ధరాత్రి దుర్గా తన అనుచరులు రామాంజి, మధుతో కలిసి చేరుకున్నాడు. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా బలరాం పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు పెద్దసంఖ్యలో ఫాంహౌస్‌ను చుట్టుముట్టారు. దీంతో దుర్గా, అతని అనుచరులు నాటు తుపాకులతో పోలీసులపై కాల్పులు జరిపారు. లింగన్న, ఖలీల్, చిక్కన్న గాయపడ్డారు. కాగా కాల్పులు జరిపి పారిపోతున్న దుర్గా అనుచరులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దుర్గా తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
ఎర్రచందనంను విదేశాలకు ఎగుమతి చేసే ముగ్గురు అంతర్జాతీయ స్మగ్లర్లను చిత్తూరు పోలీసులు గురువారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు కార్లు సహా 22లక్షల రూపాయలు విలువ చేసే 21 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఎస్‌పి పిహెచ్‌డి రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మణిపూర్ రాష్ట్రం చెందిల్ జిల్లా మోరే గ్రామానికి చెందిన మార్కోండన్ లక్ష్మణ్ (35) చిన్నతనంలోనే చెన్నైలోని తమ మామ చిన్నిదొరై వద్దకు వలస వచ్చారు.
విదేశాల నుండి చిన్నచిన్న స్మగ్లింగ్ సామగ్రి తెచ్చి విక్రయించుకుని జీవించేవాడు. 1995లో ఎర్రచందనం అక్రమ వ్యాపారాన్ని చిన్నిదోరై ప్రారంభించడంతో అతని వద్ద సూపర్‌వైజర్‌గా ఉంటూ కంటైనర్లలో ముంబై, చెన్నైల నుండి విదేశాలకు ఎర్రచందనం సరఫరా చేసేవాడు. కాల క్రమంలో లక్ష్మణ్ సొంతంగా వ్యాపారం ప్రారంభించారు.
కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని చిన్నచిన్న స్మగ్లర్ల నుండి ఎర్రచందనం సేకరించి బర్మా సరిహద్దులు దాటించేవాడు. దక్షణ భారతదేశంలోనే పేరుగాంచిన ఎర్రచందనం స్మగ్లర్ హమీద్ ఖాన్ (47)ను కూడా గురువారం చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు కొడిగనహాల్లీకి చెందిన ఇతను 2012 నుండి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు. చెన్నై టి నగర్‌కు చెందిన సయ్యద్ ఫీరాన్ మహామ్మద్ రఫీ (43) సెల్వరాజ్ వద్ద చందనం స్మగ్లింగ్ చేసే వ్యాపారం ప్రారంభించాడు.












Click it and Unblock the Notifications