తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!

Tirupati Railway Station: తిరుపతి రైల్వే స్టేషన్.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కోట్లాదిమందికి చిరపరిచితం. తిరుపతి, తిరుమల యాత్రికులకు ప్రధాన రవాణా కేంద్రంగా సేవలు అందిస్తోంది. పర్యావరణ హితమైన ఈ స్టేషన్‌కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి 'గోల్డ్ రేటింగ్' లభించింది. తిరుపతి నగర పరిధిలో తిరుచానూరు, రేణిగుంట జంక్షన్, తిరుపతి వెస్ట్ హాల్ట్, చంద్రగిరి వంటి ఇతర రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి.

గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఏ1 కేటగిరీగా వర్గీకరించారు. భారతీయ రైల్వేలలో అత్యధిక టిక్కెట్ బుకింగ్‌లు జరిగే స్టేషన్లలో ఇదీ ఒకటి. వందే భారత్ సహా అన్ని రకాల ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తోన్నాయి. ఇప్పటివరకు కనెక్టివిటీ లేని నగరాలకూ రైళ్లు రాకపోకలు సాగిస్తోన్నాయి. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, రైళ్లు, ప్లాట్ ‌ఫామ్‌ల సంఖ్యకు అనుగుణంగా దీన్ని మరింత విస్తరింపజేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీన్ని ఆధునికీకరిస్తోంది.

Redefining Travel Experience at Tirupati Railway Station in Andhra Pradesh A New Era Modern Upgrades

అంతర్జాతీయ విమానాశ్రయంలో తరహాలో తిరుపతి రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దుతోంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా కొసాగుతున్నాయి. 400 కోట్ల రూపాయల వ్యయంతో స్టేషన్‌లో పలు సౌకర్యాల అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్లాట్‌ఫామ్స్, 1,200 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో 210 మంది కూర్చునే సామర్థ్యంతో కొత్త వెయిటింగ్ హాల్‌ను నిర్మించారు. ఈ ఆధునీకరణలో భాగంగా హై-స్పీడ్ వై-ఫై, ఎల్‌ఈడీ టీవీ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

ప్లాట్‌ఫారం 1పై 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్లోక్‌రూమ్‌ను ఏర్పాటు చేసి, ప్రయాణీకుల సామాను భద్రపరచడానికి సుమారు 50 స్టీల్ రాక్‌లను అమర్చారు. బుకింగ్ కార్యాలయం, అనౌన్స్‌మెంట్ వ్యవస్థ, డిస్‌ప్లే బోర్డు ప్రాంతాలను పునరుద్ధరించారు. ప్లాట్‌ఫారం 1లో సుమారు 350 చదరపు మీటర్లకు పైగా ప్రీమియం లాంజ్‌ను నిర్మించారు.

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించే దిశగా ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, విశాలమైన ఎయిర్ కాన్‌కోర్స్, టికెట్, సహాయక బూత్‌లు, సులభ ప్రవేశానికి వీలుగా ర్యాంపులు వంటి పలు ముఖ్యమైన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.

మరోవైపు స్టేషన్‌లో సౌకర్యాలను మరింత పెంచే లక్ష్యంతో కొన్ని పనులు కొనసాగుతున్నాయి. ఇందులో లిఫ్టులు, ఎస్కలేటర్ల ఏర్పాటుతో పాటు సమర్థవంతమైన పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్, ప్లాట్‌ఫారమ్ షెల్టర్లు, విస్తరించిన పార్కింగ్ ప్రాంతం ఉన్నాయి. ఈ పనులు పూర్తయితే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఇంకో ఏడాదిలో పునర్నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+