రీల్ స్టార్స్ వర్సస్ రియల్ స్టార్స్ - ఎవరి క్రేజ్ ఏంటి..!?

తెలుగు రాజకీయాలను ప్రభావితం చేస్తుందెవరు. రీల్ స్టార్స్..రియల్ స్టార్స్. ఈ ఇద్దరిలో ఎవరు. సినీ స్టార్లు రాజకీయంగా సక్సెస్ - ఫెయిల్యూర్స్ చూశారు . కానీ, రియల్ హీరోలుగా మాత్రం కొందరు నేతలు సినీ హారోలను డామినేట్ చేసారు. ఎన్టీఆర్ ను ప్రజలు సీఎంను చేసారు. అదే ప్రజలు ఓడించారు. చిరంజీవిని హీరోగా ఆదరించారు. రాజకీయంగా నిరాకరించారు.చంద్రబాబు..వైఎస్సార్..వైఎస్సార్..జగన్ వంటి వారికి సినీ నేపథ్యం..ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోయినా..రియల్ హీరోలుగా ప్రజల మనసు గెలిచి ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు పవన్ 14 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు.

సినీ ఇండస్ట్రీ టూ పాలిటిక్స్: తమిళనాట ఎంజీఆర్, జయలలిత సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. తెలుగు నాట పార్టీ స్థాపించి తొమ్మది నెలల కాలంలోనే సీఎం అయిన ఎన్టీఆర్ కొత్త చరిత్ర లిఖించారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ప్రస్తుతం 41 ఏళ్లు ప్రస్తానం పూర్తి చేసుకుంది. రాజకీయంగా ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కోవటంతో పాటుగా ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ స్థాయిలో శక్తిని చాటింది.

1983లో కాంగ్రెస్ ను ఢీ కొన్న యోధుడిగా ఎన్టీఆర్ ను గెలిపించిన ప్రజలు..అదే ఎన్టీఆర్ ను 1989లో ఓడించారు. 1994లో తిరిగి అధికారం ఇచ్చారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టారు. చంద్రబాబు కు సినీ నేపథ్యం లేకపోయినా 1999 ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకున్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఓడినా, 2014లో రాష్ట్ర విభజన తరువాత ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.

stars

పార్టీలకు సినీ గ్లామర్: ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి తొలి నుంచి సినీ గ్లామర్ ఎక్కువే. నందమూరి హీరోలతో పాటుగా, జయప్రద, మోహన్ బాబు, మురళీ మోహన్ వంటి వారు టీడీపీకి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత మంత్రి రోజా కూడా టీడీపీ లో క్రియా శీలకంగా వ్యవహరించారు. బాబూ మోహన్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. కే రాఘవేంద్ర రావు, అశ్వినీదత్ తో సహా సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు టీడీపీ కోసం పని చేసారు.

ఇటీవల మరణించిన సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, జమున వంటి ప్రముఖులు కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. గెలిచారు. జయసుధ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసారు. విజయశాంతి టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు. కోట శ్రీనివాస రావు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివ్య వాణి, సుమన్, ఆలీ, కవిత వంటి చిత్ర ప్రముఖులు టీడీపీలో పని చేసారు.

ntr-senior

రియల్ హీరోలుగా..విజయం:కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం అసమ్మతి నేతగా ముద్ర ఎన్న వైఎస్సార్ తన పాదయాత్ర ద్వారా 2004లో ఉమ్మడి రాష్ట్రానికి నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. 2009లో నాడు సినీ హీరో చిరంజీవి పార్టీ ఏర్పాటు చేసి.. అటు చంద్రబాబు మహా కూటమితో బరిలో నిలిచినా..ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు. 2009 సెప్టెంబర్ 2న వైఎస్సార్ మరణంతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు మారిపోయాయి.

తెలంగాణ కోసం ఉద్యమం చేసిన కేసీఆర్ రాష్ట్ర ప్రజల మనసు గెలిచి రియల్ హీరోగా నిలిచారు. రెండు సార్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక, జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉంటూనే, సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి 2014లో పోటీ చేసి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచారు, 2019 ఎన్నికల వేళ సుదీర్ఘ పాదయాత్రతో రికార్డు నెలకొల్పి..అదే స్థాయిలో ఎన్నికల్లో 151 సీట్లు సాధించి ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు.

 cbnjaganysr

మెగా బ్రదర్స్ కు మాత్రం: 2009 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అత్యధిక సంఖ్యలో సినీ ఫ్యాన్స్ ఉన్న హీరో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించారు. భారీ అంచనాల నడుమ చిరంజీవి పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. కేవలం 18 స్థానాలు దక్కించుకుంది. ఆ తరువాత పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసారు. కేంద్ర మంత్రిగా పని చేసారు.

రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు దూరం అయ్యారు. అప్పుడు మద్దతుగా నిలిచిన తమ్ముడు పవన్ జనసేన స్థాపించారు, ప్రజారాజ్యంతో సాధించలేకపోయింది..తన పార్టీ తో సాధించాలని భావించారు. కానీ పదేళ్ల కాలంలో పార్టీ ఒకే ఒక్క ఎమ్మెల్యేను గెలుచుకుంది. పవన్ 2019లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. ఇప్పుడు 2023 ఎన్నికలకు సిద్దం అవుతున్నారు.

 chirupawan
రాజకీయాల్లో సినీ స్టార్లు : ఇప్పుడు సినీ రంగంతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులు రాజకీయంగా కీలకంగా మారారు. రోజా మంత్రిగా, నందమూరి బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. జీవిత- రాజశేఖర్ బీజేపీలో కొనసాగుతున్నారు. మంచు ఫ్యామిలీకి వైసీపీతో సత్సంబంధాలు ఉన్నాయి. నందమూరి యువ హీరోలు 2023 ఎన్నికల్లో పోటీకి- ప్రచారానికి సిద్దం అవుతున్నారు. మెగా ఫ్యామిలీ పవన్ కు మద్దతుగా నిలుస్తోంది.

తాజాగా నితిన్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. దిల్ రాజ్ కు ఆఫర్లు వచ్చినా తిరస్కరించారు. తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ తో మొదలైన సినీ - పొలిటికల్ సంబంధాలు బలపడ్డాయి. కానీ, ప్రజలు మాత్రం ప్రతీ ఎన్నికలోనూ విలక్షణ తీర్పులు ఇస్తూనే ఉన్నారు. రీల్ హీరోలు - రియల్ హీరోల్లో ఎప్పుడు ఎవరికి ఏ రంగంలో మద్దతు ఇవ్వాలో అలాగే ఆదరిస్తూ తమ పరిణితి చాటుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+