ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా..
భారతదేశంలో రోజురోజుకు బిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో ముకేష్ అంబానీ 91.4 బిలియన్ డాలర్ల సంపదతో తొలిస్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 52.3 బిలియన్ డాలర్లతో మూడోస్థానంలో నిలిచారు. ఇక రెండో స్థానంలో ఝోంగ్ శాంశాన్ నిలిచారు. 68 ఏళ్ల ఝోంగ్ శాంశాన్ సంపద 64.2 బిలియన్ డాలర్లు. బేవరేజెస్ కంపెనీ నాగ్ఫూ స్ప్రింగ్ అనే సంస్థను స్థాపించారు. బీజింగ్ వాంటాయ్ బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్‌ప్రైజెస్ ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ప్రధానంగా కొవిడ్-19 టెస్ట్ కిట్లను సరఫరా చేస్తోంది.
సొంత వ్యాపారం ప్రారంభించక ముందు ఝోంగ్ శాంశాన్ నిర్మాణ రంగంలో కార్మికుడిగా, ఒక న్యూస్ రిపోర్టర్‌గా, బేవరేజ్ సేల్స్ ఏజెంట్‌గా పని చేశారు. చైనా కల్చరల్ రెవల్యూషన్ గొడవల సమయంలో ప్రాథమిక విద్యను మధ్యలోనే మానేశారు. చైనాలోని హాంగ్‌ఝౌ ప్రాంతం ఆయన స్వస్థలం. మీడియా ముందుకు రావడాన్ని ఆయన పెద్దగా ఇష్టపడరు. చైనా మీడియా శాంశాన్ ను లోన్ వోల్ఫ్ అంటూ సంబోధిస్తుంటుంది.

హిడెన్‌బర్గ్ రిపోర్ట్ దెబ్బ
ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఎప్పుడూ తొలి రెండుస్థానాల్లో నిలిచేవారు. అయితే ఈ సంవత్సరం జనవరిలో అమెరికాకు చెందిన షార్ట్ షెల్లర్ హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్ సంస్థలపై ఆరోపణలు చేస్తూ ఓ సంచలన నివేదికను వెలువరించింది. దీంతో ఒక్కసారిగా అదానీ షేర్లు కుప్పకూలాయి. గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద సైతం కరిగిపోయింది. దీంతో ఆయన ఫోర్బ్స్ జాబితాలో ఎన్నో స్థానాలు కింద పడిపోయారు. అయినప్పటికీ మళ్లీ వేగంగా పుంజుకుంటున్నారు. తాజాగా విడుదలైన రియల్ టైమ్ రిచెస్ట్ మ్యాన్ జాబితాలో గౌతమ్ అదానీ ఆసియాలోనే రెండో ధనవంతుడిగా నిలిచారు
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications