జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏమిటి?
సెప్టెంబరు 19వ తేదీ వినాయకచవితి రోజు నుంచి రిలయన్స్ జియో నుంచి ఎయిర్ ఫైబర్ సేవలు ప్రారంభమవుతాయని ఇటీవలే సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా జియో ఫైబర్ సేవలు విస్తరించివున్నాయి. జియో ఫైబర్ కు, జియో ఎయిర్ ఫైబర్ కు తేడా ఏమిటి? ఎలా పనిచేస్తుంది? అనే విషయాలను తెలుసుకుందాం.
ఒక కుటుంబం సగటున నెలకు 280 జీబీ డేటా ఖర్చు చేస్తోంది. జియో మొబైల్ డేటాకంటే 10 రెట్లు ఎక్కువ. వైర్డ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్సన్లను సులభతరం చేయడానికి
ఆర్కిటెక్చర్ అవసరం. నగరాల్లో సమస్యవదుకానీ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, కనెక్షన్ కోసం అవసరమైన ఆప్టికల్ ఫైబర్‌ను వేయడం కంపెనీలన్నింటికీ సవాల్ గా మారింది. జియో ఆప్టికల్ ఫైబర్ భారతదేశం అంతటా 1.5 మిలియన్ కిలోమీటర్లకు పైగా విస్తరించింది. అయితే ఇది కూడా ప్రతి ఇంటిని చేరుకోవడానికి సరిపోదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ తెస్తోంది.

5జీ డేటా నెట్‌వర్క్‌ను ఉపయోగించి, ఎయిర్‌ఫైబర్ ఇప్పటికే ఉన్న 5జీ టవర్ల నుంచి డేటాను సేకరిస్తుంది. వాటిని వినియోగదారులకు అందించడానికి రిసీవర్‌లు, రౌటర్లను ఉపయోగిస్తుంది. ఎలాంటి కేబుల్స్, వైర్స్ అవసరం లేకుండా రిసీవర్లు, రౌటర్లు జియో టవర్ల నుంచి 5జీ డేటాను యాక్సెస్ చేస్తాయి. ఇంట్లో రూటర్ ఉంటుంది. మరో అప్లయెన్స్ 5జీ సిమ్ కార్డుతో బయట ఉంటుంది. సమీపంలో ఉన్న టవర్ నుంచి 5జీ డేటాను సేకరించి, రూటర్ ద్వారా ఇది వినియోగదారులకు అందిస్తుంది. 1జీబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ వేగంతో 5జీ డేటా ఉపయోగించుకోవచ్చు. మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కష్టంగా ఉన్న మారుమూల గ్రామీణ ప్రాంతాలకు దీనిద్వారా సులువుగా చేరుకోవచ్చు.
ఆప్టికల్ ఫైబర్ ద్వారా ప్రతీరోజూ 15,000 ఇళ్లను జియో కనెక్ట్ చేయగలుగుతుంది. ఎయిర్ ఫైబర్ ద్వారా రోజుకు 1,50,000 కనెక్షన్లకు చేరుకుంటామని జియో వెల్లడించింది. ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ వివరాలు వెల్లడించలేదు. 19న లాంఛింగ్ సమయంలో వీటిని ప్రకటించే అవకాశం ఉంది












Click it and Unblock the Notifications