Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విద్యుత్ ఛార్జీలు తగ్గింపు.. మంత్రి గొట్టిపాటి గుడ్ న్యూస్

అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారం మోపిందని, ఆ భారాన్ని కూటమి ప్రభుత్వం తగ్గిస్తోందని చెప్పారు. నవంబర్ నెల నుంచి ప్రతి యూనిట్‌పై 13 పైసలు తగ్గిస్తున్నామని, రానున్న రోజుల్లోనూ మరింత భారం లేకుండా చేస్తామని అన్నారు. ఆదివారం అమరావతి లోని క్యాంపు కార్యాలయంలో గొట్టిపాటి రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ...'జగన్ ప్రభుత్వం 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచింది. 2019లో తెలుగు దేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా చంద్రబాబు తీర్చిదిద్దారు. కానీ జగన్ వచ్చాక 5 ఏళ్లలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారు. రూ.1.25 లక్షల కోట్ల మేర అప్పులు ఊబిలోకి నెట్టారు' అని మంత్రి వివరించారు.

సీఎం చంద్రబాబు అనుభవంతోనే విద్యుత్ వ్యవస్థలో సంస్కరణలు

5 ఏళ్లు సీఎంగా ఉండి జెన్కో, ట్రాన్స్‌కో వ్యవస్థలను జగన్ నాశనం చేశారు. వీటీపీఎస్, కృష్ణపట్నంలో విద్యుత్ తయారు చేసుకునే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. బయటి రాష్ట్రాల నుంచి ఎక్కువ ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేశారు. 2019కు ముందు రెన్యువబుల్ ఎనర్జీలో ఏపీ ముందుంది. 7 నుంచి 9 వేల మెగావాట్లపై చిలుకు విద్యుత్ ఉత్పత్తి చేశాం. కానీ జగన్ వచ్చాక కక్ష సాధింపులతో పీపీఏలు రద్దు చేశారు. ఒప్పందం చేసుకున్న విద్యుత్‌ను వాడకపోవడంతో రూ.9 వేలకోట్లు ఆ సంస్థలకు అప్పనంగా చెల్లించాల్సి వచ్చింది. ఆ భారమంతా ప్రజలపైనే పడింది. కేంద్రం ఇచ్చే రాయితీ పథకాలను కూడా వినియోగించుకోలేదు.

వీటీపీఎస్ కు బొగ్గు సరఫరా చేసి నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి చేయాలని 70 శాతం వినియోగంలోకి తెచ్చాం. 90 శాతం మేర విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రయత్నం చేస్తాం. కృష్ణపట్నం, కడపలోని ప్లాంట్లను కూడా వినియోగంలోకి తెస్తాం. విద్యుత్ కొనుగోలు తగ్గించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. గత ప్రభుత్వంలో 17 శాతం పైన ఉండే షార్ట్ టర్మ్ విద్యుత్ కొనుగోలును 6.8 శాతానికి తగ్గించాం. శ్వాపింగ్ విధానం ద్వారా అవసరమైనప్పుడు మాత్రమే రాజస్థాన్, హర్యాన రాష్ట్రాల నుంచి పవర్ తీసుకుంటున్నాం. విద్యుత్ రంగంలో సీఎం చంద్రబాబుకు అపారమైన అనుభవం ఉంది. దేశంలో మొదటిసారి సంస్కరణలు తెచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు' అని గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

20 లక్షల సోలార్ రూఫ్‌టాప్ లు ఏర్పాటు లక్ష్యం

రాష్ట్రంలో పీఎం సూర్యఘర్ పథకం కింద 20 లక్షల రూఫ్‌టాప్ ఏర్పాటు లక్ష్యాన్ని సీఎం చంద్రబాబు విధించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. కేంద్రం ఇచ్చే రాయితీ కాకుండా బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల సబ్సీడీ ఇస్తుంది. పీఎం కుసుమ్ కింద 12 కేవీ లైన్స్ నుంచే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను పగటి పూటే ఇస్తున్నాం. పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నాం. జెన్ కో నుంచి ట్రాన్స్‌కో లైన్స్, ఉత్పత్తి చేపట్టాం. 400 కేవీ, 200 కేవీ, 33/11కేవీ విద్యుత్ స్టేషన్లు నిర్మిస్తున్నాం. ప్రతి ఏటా 6 నుంచి 8 శాతం విద్యుత్ వినియోగం పెరుగుతోంది. దానికి అనుగుణంగా లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఉత్పత్తి, సరఫరా చేస్తున్నాం' అని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.

గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ శాఖను ఆదాయ వనరుగా మార్చుకుంది

రాష్ట్రంతో పాటు అమరావతి రాజధాని భవిష్యత్‌ను దృష్టిపెట్టుకుని సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. రాయల సీమలో విండ్, సోలార్ పవర్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. బ్యాటరీ స్టోరేజీకి (BESS)కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పగటిపూట విద్యుత్ ఉత్పత్తి చేసి బ్యాటరీల ద్వారా నిల్వ చేసి రాత్రిపూట పీక్ సమయాల్లో వినియోగించుకునే అవకాశం ఉంది. వీటి ఏర్పాటుకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయి. పీ ఎస్ పీ లకు ప్రకాశం జిల్లాలో టెండర్లు కూడా పిలిచాం. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను ఆదాయ వనరుగా మార్చుకుంది' అని మంత్రి విమర్శలు చేశారు.

ఛార్జీల తగ్గింపుతో చిరువ్యాపారులకు మేలు

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 2021-22లో రూ.3 వేల కోట్లు, 2022-23లో రూ.6,073 కోట్లు, 2023-24లో ప్రొవిజనల్ కలెక్షన్ అంటూ రూ.9,300 కోట్లు భారం వేశారు. ప్రతి యూనిట్‌పై అదనంగా 40 పైసలు భారం వేశారు. మొత్తం మీద ఐదేళ్లలో ప్రజల నెత్తిన రూ.18 వేల కోట్లకు పైగా విద్యుత్ భారం మోపారు. ప్రస్తుతం ట్రూడౌన్ ద్వారా 13 పైసలు తగ్గించాం. 2019లో మేం దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ ఉంచాం. కానీ జగన్ దిగిపోయే నాటికి విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారు. విపరీతమైన భారాలు వేశారు.

Relief for Households Ravi Kumar Announces 13 Paise Cut in Power Tariff from November

సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా రాజస్థాన్‌ నుంచి 9 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేశారు. ఇవన్నీ బిల్లుల రూపంలో ప్రజలపై భారం పడింది. ఇష్టానుసారంగా విద్యుత్ కొనుగోలుపై ఖర్చు చేశారు. గత ప్రభుత్వం విధించిన ట్రూ అప్ ఛార్జీలతో చిన్న పరిశ్రమలదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రతి 10 రోజులకు ఒకసారి సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖపై సమీక్ష చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఛార్జీల భారం తగ్గుతుంది. ఈ తగ్గింపులు ప్రజలకు భారం లేకుండా చేయడంతో పాటు పరిశ్రమల రాకకు ఊతమిస్తాయి' అని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+