YS Sharmila: సుప్రీంకోర్టులో వైఎస్ షర్మిలకు ఊరట- కానీ లేటుగా..!

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఇవాళ సుప్రీంకోర్టులో ఊరట లభించింది. షర్మిల తాజాగా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పు ప్రకటించింది. గతంలో కడప కోర్టు, ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ షర్మిల ఈ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో షర్మిలకు ఊరట దక్కినా ఇప్పటికే ఆలస్యం కావడం ఇక్కడ విశేషం.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యను అజెండాగా మార్చుకుని కడప లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఆయన కుమార్తె సునీతను వెంటబెట్టుకుని ప్రచారం చేశారు. ఇందులోనూ ప్రతీచోటా వివేకా హత్యను ప్రస్తావిస్తూ వచ్చారు. దీంతో వైసీపీ నేతలు కడప కోర్టును ఆశ్రయించి ఊరట పొందారు. వివేకా కేసుపై షర్మిల తో పాటు సునీత, చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి వంటి నేతలు కూడా మాట్లాడకుండా కడప కోర్టు అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది.

relief to apcc chief ys Sharmila in supreme court get stay on Kadapa court gag order

అయితే దీనిపై షర్మిల, సునీత, బీటెక్ రవి హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టులోనూ వీరికి ఊరట లభించలేదు. వివేకా కేసుపై మాట్లాడకుండా వీరిపై విధించిన ఆంక్షల వ్యవహారాన్ని కడప కోర్టులోనూ తేల్చుకోవాలని హైకోర్టు తేల్చిచెప్పేసింది. ఈ నేపథ్యంలో షర్మిల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇవాళ కడప కోర్టు ఆదేశాలపై స్టే స్తూ కీలక తీర్పు వెలువరించింది. అయితే ఎన్నికల ప్రక్రియ ముగియడంతో షర్మిలకు కూడా అంత తీవ్ర స్ధాయిలో వివేకా హత్య కేసును ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+