జగన్ సెల్ ఫోన్ కేసులో టర్నింగ్..! సీబీఐ కోర్టు కీలక తీర్పు..!
ఏపీలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెల్ ఫోన్ నంబర్ వివాదంలో ఇవాళ కీలక మలుపు చోటు చేసుకుంది. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ తనకు గతంలో విధించిన బెయిల్ షరతుల్లో భాగంగా విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు తన మొబైల్ ఫోన్ నంబర్ ను సీబీఐకి ఇచ్చి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఇచ్చిన నంబర్ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. దీనిపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై చుక్కెదురైంది.
ఈ నెలలో జగన్ తన కుమార్తెను కలిసేందుకు లండన్ వెళ్లారు. 10 రోజుల పాటు లండన్ టూర్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అయితే ఎప్పటిలాగే బెయిల్ షరతుల్లో భాగంగా తాను అందుబాటులో ఉంటే మొబైల్ ఫోన్ నంబర్ ను కూడా సీబీఐకి ఇచ్చారు. కానీ గతంలో ఇచ్చిన మొబైల్ నంబర్, ఈసారి ఇచ్చిన నంబర్ కూ మధ్య వ్యత్యాసం ఉండటంతో సీబీఐ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా బెయిల్ షరతులు ఉల్లంఘించారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన హైదరాబాద్ సీబీఐ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. లండన్ పర్యటనలో ఉన్న సమయంలో మూడు సార్లు జగన్‌కి కాల్ చేసినా నెంబర్ పని చేయలేదని సీబీఐ ఈ పిటిషన్‌లో పేర్కొంది. ఉద్దేశ పూర్వకంగానే పని చేయని నెంబర్ ఇచ్చారని సీబీఐ వాదనలు వినిపించింది. జగన్ లాయర్లు మాత్రం జగన్ టూర్ కూడా పూర్తయిందని, ఆయన తిరిగి వచ్చేశారని కోర్టుకు తెలిపారు. దీంతో వాదనలు పూర్తి చేసిన సీబీఐ కోర్టు.. సీబీఐ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జగన్ కు ఊరట లభించినట్లయింది.












Click it and Unblock the Notifications