renu desai: కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోన్న రేణూదేశాయ్
‘బద్రి’ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది రేణూ దేశాయ్.
'బద్రి' సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది రేణూ దేశాయ్. తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తరుచుగా సమాచారాన్ని అందిస్తుంటుంది. తాజాగా ఆమె ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యపై రేణూ దేశాయ్ పోస్ట్ పెట్టింది. త్వరలోనే కోలుకొని సాధారణ స్థితికి వస్తానని ఆశిస్తున్నట్లు తెలిపింది.
గత కొన్ని సంవత్సరాలుగా గుండె సంబంధ సమస్య, మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పుడే ఎందుకు చెబుతున్నానంటే తనలా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ధైర్యాన్నివ్వడం కోసం, వారిలో పాజిటివిటీని నింపేందుకే ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యాన్ని కోల్పోకూడదని, శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా బలంగా ఉండాలని సూచించారు. అలా ఉంటే ఎప్పటికైనా ఫలితం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోను మీపై, మీ జీవితంపై ఆశను కోల్పోవద్దన్నారు.

మనకోసం ఈ విశ్వం ఎన్నో అద్భుతాలను దాచివుంచిందని, ఎలాంటి పరిస్థితులనైనా నవ్వుతూ ఎదుర్కోవాలని వెల్లడించింది. దీనికి సంబంధించి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, యోగా, ఔషధాలు, పోషకాహారాన్ని తీసుకుంటున్నట్లు, త్వరలోనే తాను సాధారణ స్థితికి వచ్చి తిరిగి షూటింగ్ లో పాల్గొనాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై స్పందించిన అభిమానులు, నెటిజన్లు రేణూదేశాయ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.
పవన్ కల్యాణ్ నుంచి రేణూదేశాయ్ విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. వాళ్లు చేసే అల్లరిని, వారి సరదా సంగతుల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాద్వారా తెలుపుతుంటారు. వాటిని అభిమానులతో పంచుకుంటుంటారు. తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యతో కలిసి పూణెలో ఉంటున్నారు.












Click it and Unblock the Notifications