చిరుకు దానం కౌంటర్: నేనే వద్దన్న: రేణుకా చౌదరి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కారని ఆమె కితాబు ఇచ్చారు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెను దగ్గర ఉండి చూసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ స్థితిలో ఎఐసిసి అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించలేనని పార్టీ అధిష్టానానికి చెప్పానని, దాంతోనే తనను ఆ బాధ్యత నుంచి తప్పించారని ఆమె వివరించారు.
ఇదిలావుంటే, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే సీమాంధ్ర కేంద్ర మంత్రులు చిరంజీవి, జెడి శీలం తదితరుల డిమాండ్‌ను హైదరాబాదుకు చెందిన రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ వ్యతిరేకించారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే తాము ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. బుధవారం హైదరాబాదులో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
హైదారాబాదులో సీమాంధ్ర ప్రజల రక్షణ బాధ్యత తమదేనని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మాటగా తాము ఆ విషయాన్ని చెబుతున్నామని దానం నాగేందర్ అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరు సీమాంధ్ర నేతలు హైదరాబాదును యుటీగా చేయాలని కోరుతున్నారని, హైదరాబాద్ ప్రజాప్రతినిధులం దద్దమ్మలం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications