రేణుకా చౌదరి దెబ్బ: రేగా కాంతారావు ఔట్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పినపాక కాంగ్రెసు శాసనసభ్యుడు రేగా కాంతారావు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి దెబ్బను రుచి చూశారు. రేగా కాంతారావు ఖమ్మం డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన గంటలోపే అది కాస్తా ఊడిపోయింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పినపాక శాసనసభ టికెట్ కూడా ఆయన దక్కలేదు. దీంతో ఆయన కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు.
రేగా కాంతారావు పినపాక సీటు తనకు ఇవ్వకపోవడంపై హైదరాబాదులోని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వచ్చినప్పుడు హైడ్రామా చోటు చేసుకుంది. పినపాక సీటు పొత్తులో భాగంగా సిపిఐకి వెళ్లింది. దీంతో టికెట్ దక్కని రేగా కాంతారావును బుజ్జగిస్తూ ఆయనకు డిసిసి అధ్యక్ష పదవిని పొన్నాల లక్ష్మయ్య కట్టబెట్టారు.
అయితే, రేగా కాంతారావుకు డిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై రేణుకా చౌదరి భగ్గుమన్నారు. ఆ పదవిని లంబాడాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానికితోడు, రేణుకా చౌదరి, పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ పొన్నాల లక్ష్మయ్య ఇంటికి చేరుకున్నారు. ఆయనతో వారిద్దరు వివాదానికి దిగారు. దాంతో కాంతారావు డిసిసి అధ్యక్ష పదవి ఊడింది. దాంతో ఆయన పార్టీని కూడా వదులుకున్నారు.

సీటు పోయింది..
పినపాక సిట్టింగ్ శాసనసభ్యుడు రేగా కాంతారావుకు తిరిగి టికెట్ లభించలేదు. పినపాకను కాంగ్రెసు నాయకత్వం సిపిఐకి కేటాయించింది. దీంతో ఆయన టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసానికి వచ్చారు.

డిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు..
పినపాక టికెట్ దక్కకపోవడంతో బుజ్జగించి పొన్నాల లక్ష్మయ్య రేగా కాంతారావును ఖమ్మం డిసిసి అధ్యక్షుడిగా నియమించారు.

బలరాం నాయక్ ప్రయత్నం..
రేగా కాంతారావును బుజ్జగించేందుకు ఎంపి బలరాం నాయక్ ప్రయత్నించారు. మీడియాతో మాట్లాడడానికి ప్రయత్నించిన రేగాను ఆయన పొన్నాల నివాసంలోకి తీసుకుని వెళ్లారు.

రేగాకు రేణుకా చౌదరి దెబ్బ
రేగా కాంతారావును డిసిసి అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారంటూ రేణుకా చౌదరి పొన్నాల లక్ష్మయ్యను నిలదీశారు. దీంతో రేగా కాంతారావుకు ఆ పదవి కూడా దక్కలేదు.

పొన్నాలతో రేగా కాంతారావు...
డిసిసి అధ్యక్ష పదవితో రేగా కాంతారావు సంతృప్తి పడినట్లే కనిపించారు. కానీ ఆ తర్వాత సీన్ రివర్సయింది.

ఘర్షణవాతావరణం..
రేగా కాంతారావు మీడియాతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు కాస్తా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బలరాం నాయక్ రేగాను బలవంతంగా పొన్నాల ఇంట్లోకి తీసుకుని వెళ్లారు.

మల్లు భట్టితో రేగా కాంతారావు..
తనకు పినపాక టికెట్ దక్కకపోవడంతో ఖమ్మం జిల్లాకే చెందిన మల్లు భట్టి విక్రమార్కతో పొన్నాల నివాసంలో మాట్లాడుతున్న రేగా కాంతారావు

స్వీటు కూడా తినిపించారు..
డిసిసి అధ్యక్ష పదవి ఇచ్చి రేగా కాంతారావుకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వీటు కూడా తినిపించారు.

రేణుకా చౌదరి ప్రవేశం..
రేగా కాంతారావును డిసిసి అధ్యక్షుడిగా నియమిస్తూ పొన్నాల లక్ష్మయ్య ఆదేశాలు ఇవ్వడంతో దాన్ని వ్యతిరేకిస్తూ రేణుకా చౌదరి రంగప్రవేశం చేశారు.

బలరాం నాయక్‌తో రేగా...
రేగా కాంతారావును పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ బలవంతంగా పొన్నాల లక్ష్మయ్య నివాసంలోకి తీసుకుని వెళ్తున్న దృశ్యం












Click it and Unblock the Notifications