కెసిఆర్‌కు భయం, నన్ను కాదని... మగాడెవరు: రేణుకా

ఆమె ఉదయం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో యువతకు, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కెసిఆర్‌కు జవాబు చెప్పగలిగేది తాను ఒక్కరినేనన్నారు. తనను చూసి కెసిఆర్ భయపడతారన్నారు. ఖమ్మం టిక్కెట్ తనకు కాదని ఇంకెవరికి ఇస్తారని, తనను కాదని టిక్కెట్ తీసుకునే మగవాళ్లెవరని ప్రశ్నించారు.
సైకిల్, ఫ్యాన్ గుర్తులకు ఓటు వద్దు: రఘువీరా
సీమాంధ్ర ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపేందుకు చేపట్టిన బస్సు యాత్ర అనంతపురం చేరుకుంది. పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రఘువీరా రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెసు నాయకులు నరహంతకులు చెప్పారని, ఇప్పుడు వారినే పార్టీలోకి చేర్చుకుంటున్నారని, ఇప్పుడు వారు మంచివారయ్యారా అని ప్రశ్నించారు. కాంగ్రెసులోని పనికి మాలిన సరుకును ఎందుకు తీసుకుంటున్నారన్నారు. టిడిపి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదన్నారు. సైకిల్, ఫ్యాన్ గుర్తులకు ఓటేస్తే రాష్ట్రానికి అన్యాయం చేసినట్లే అవుతుందన్నారు.
ఆచరణ సాధ్యం కాని హామీలు
కాంగ్రెసు పార్టీ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తోందని బిజెపి నేత వెంకయ్య నాయుడు హైదరాబాదులో అన్నారు. యూపిఏ హయాంలో సంస్కరణలు తీసుకు వస్తామని నాడు చెప్పారని కానీ, ఇప్పటి వరకు ఎలాంటి సంస్కరణలు తీసుకు రాలేదన్నారు. 90 శాతం హామీలు అమలుపరిచామని చెప్పడం విడ్డురమన్నారు. తొమ్మిది శాతం కూడా అమలు చేయలేదన్నారు. కాంగ్రెసు మేనిఫెస్టో కొత్త మూసలో పోసినట్లుగా ఉందన్నారు.
తప్పుడు సంఖ్యలు, తప్పుడు అంకెలతో కూడిన లెక్క కాంగ్రెసు మేనిఫెస్టో అన్నారు. ప్రజలను మోసం చేసే విధంగా ఉందన్నారు. పలువురు కాంగ్రెసు పార్టీ నేతలు టచ్‌లో ఉన్నారనే వార్తలపై స్పందిస్తూ... ఒక పార్టీలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడటం భావ్యం కాదన్నారు. తనతో అయితే వారు టచ్‌లో లేరన్నారు. పత్రికకల్లో వచ్చిన వార్తల ఆధారంగా తాను మాట్లాడనని చెప్పారు.












Click it and Unblock the Notifications