ఏపీ నుంచి 16 మంది పోలీసులకు ప్రతిష్ఠాత్మక అవార్డులు: కంప్లీట్ లిస్ట్ ఇదే
అమరావతి: గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి దేశం సన్నద్ధమౌతోంది. దేశ రాజధానిలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇది 73వ గణతంత్ర దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఈ సాయంత్రం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దూరదర్శన్‌కు చెందిన అన్ని ఛానళ్లు ఇంగ్లీష్, హిందీ భాషల్లో దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
ఆకాశవాణి కూడా ఆయన ప్రసంగాన్ని వినిపిస్తుంది. రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించి రాత్రి 9:30 గంటలకు ఆకాశవాణి- ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన పోలీసులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రదానం చేస్తుంది. ఏపీ నుంచి 16 మంది పోలీసులు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం ఎంపికయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి జాబితా కొద్దిసేపటి కిందటే విడుదలైంది.

ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ కోసం ఏపీ నుంచి భావన సక్సేన ఎంపిక అయ్యారు. ప్రస్తుతం ఆమె దేశ రాజధానిలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పని చేస్తోన్నారు. శాంతిభధ్రతల విభాగం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్వీ రాజశేఖర్ బాబు, తూర్పు గోదావరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు, నెల్లూరు సీఐడీ డీఎస్పీ శ్రీరాం బాబు వాకా, విజయవాడ ఈస్ట్ జోన్ ఏసీపీ విజయపాల్ కైలె రిపబ్లిక్ డే మెడల్స్ కోసం ఎంపికయ్యారు.
విశాఖపట్నం గ్రేహౌండ్స్ అసిస్టెంట్ కమాండెంట్ విజయ్ కుమార్ బులా, విశాఖపట్నం సిటీ ఏఆర్ఎం అదనపు డీఎస్పీ సుబ్రహ్మణ్యం కోలగాని, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గుంటూరు రీజినల్ డీఎస్పీ శ్రీనివాస రావు చుండూరు, అనంతపురం డీఎస్సీ వీర రాఘవ రెడ్డి, కర్నూలు డీఎస్పీ రవీంద్ర రెడ్డి యర్రమోరుసు ఈ జాబితాలో ఉన్నారు. విజయవాడ సిటీ సీసీఎస్ సబ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణారావు గొల్ల, కాకినాడ కమాండెంట్ కార్యాలయం అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ సత్తారు సింహాచలం ఈ పోలీస్ మెడల్స్‌ను అందుకోనున్నారు.
Recommended Video
గుంటూరు అర్బన్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ నరేంద్ర కుమార్ తూమాటి, కడప టూటౌన్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పేరూరు భాస్కర్, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నాగ శ్రీనివాస్ షైరంగ్, విజయవాడ అవినీతి నిరోధక విభాగం ఏఎస్ఐ వీరాంజనేయులు సింగంశెట్టి- ఈ అవార్డులను అందుకోబోయే వారి జాబితాలో ఉన్నారు. తెలంగాణ నుంచి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ కోసం ఇద్దరు ఎంపికయ్యారు.












Click it and Unblock the Notifications