విజయవాడ పినాకినీ ఎక్స్ ప్రెస్ టైమ్ టేబుల్ లో మార్పులు
MGR Chennai Central- Vijayawada Pinakini Super Fast: ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- విజయవాడ మధ్య రాకపోకలు సాగించే పినాకినీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ టైమ్ టేబుల్ లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి. లైన్ బ్లాక్/పవర్ బ్లాక్ ఇంజినీరింగ్ మరమ్మతు పనుల వల్ల సమయాన్ని సవరించాల్సి వచ్చింది.
ఈ విషయాన్ని దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు. చెన్నై డివిజన్ పరిధిలోని పొన్నేరి- కవరాయ్ పేట్టై మధ్య ఈ ఇంజినీరింగ్ పనులను చేపట్టింది దక్షిణ రైల్వే. ఫలితంగా ఈ మార్గంలో నడిచే పినాకినీ సూపర్ ఫాస్ట్ సహా పలు రైళ్ల రాకపోకల వేళల్లో మార్పులు చేసింది.

ఈ మార్పులు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నెల చివరి వరకూ కొనసాగనున్నాయి. సాధారణంగా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి మధ్యాహ్నం 2:05 నిమిషాలకు బయలుదేరే నంబర్ 12712 పినాకినీ ఎక్స్ ప్రెస్.. అదే రోజు రాత్రి 9:35 నిమిషాలకు విజయవాడకు చేరుకుంటుంది.
తాజాగా చేసిన సవరణల ప్రకారం.. ఈ నెల 12, 16, 19, 23, 26, 30 తేదీల్లో పినాకినీ ఎక్స్ ప్రెస్.. చెన్నై సెంట్రల్ లో 20 నిమిషాల పాటు ఆలస్యంగా బయలుదేరుతుంది. అంటే మధ్యాహ్నం 2: 05కు బదులుగా 2:25 నిమిషాలకు విజయవాడకు బయలుదేరుతుంది. దానికి అనుగుణంగా విజయవాడకు ఆలస్యంగా చేరుకుంటుంది.
సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు జంక్షన్, నెల్లూరు, బిట్రగుంట, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి జంక్షన్ లల్లో ఈ ఎక్స్ ప్రెస్ హాల్ట్ సౌకర్యం ఉన్న విషయం తెలిసిందే. ఆయా స్టేషన్లన్నింట్లో కూడా రోజువారీ కంటే ఆయా తేదీల్లో 20 నిమిషాల పాటు ఆలస్యంగా రాకపోకలు సాగించవచ్చు.












Click it and Unblock the Notifications