ట్విస్ట్: రెబల్స్‌కు ఎమ్మెల్యేలు ముఖం చాటు, హైకోర్టుకు..

దీంతో చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలను తీసుకు వెళ్లే పనిలో పడ్డారు. అయితే పలువురు ఎమ్మెల్యేలు వారికి ముఖం చాటేస్తున్నారు. కొందరు శాసన సభ నుండి బయటకు వెళ్లి పోగా, మరికొందరు ఫోన్లు స్విచ్చాఫ్ చేసి పెట్టారు. చైతన్య రాజుకు మద్దతిచ్చిన వారిలో 8 మంది, ఆదాలకు మద్దతిచ్చిన వారిలో 8 మంది తమ మద్దతును ఉపసంహరించుకున్నారు.
అంతకుముందు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ రిటర్నింగ్ అధికారికి లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు మంత్రి వట్టి వసంత్ కుమార్ రిటర్నింగ్ అధికారిని కలిసి.. చైతన్య రాజు పైన క్రిమినల్ కేసులు ఉన్నందున ఆయన నామినేషన్ తిరస్కరించాలని కోరారు.
హైకోర్టుకైనా...
రాజ్యసభ ట్విస్టుల పైన ఆదాల, చైతన్య రాజులు స్పందించారు. రాజ్యాంగంలో లేని నిబంధనను ఇప్పుడు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. తమ పైన, తమకు మద్దతిచ్చిన వారి పైన పార్టీ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారని, వారి ఒత్తిడికి తాము ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గేది లేదన్నారు.
తేడా వస్తే హైకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని చెబుతున్నారు. ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి బొత్స వెనక్కి తీసుకున్న లేఖలకు విలువ ఉండదని చెబుతున్నారు. వారు రిటర్నింగ్ అధికారిని కలిసి ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆదాల, చైతన్య రాజుల మినహా మిగతా ఆరు నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి చెప్పారు.












Click it and Unblock the Notifications