వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌పై రేవంత్ ఫైర్: సిక్సర్ కొడితే స్టేడియం ఆవల..ఆనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సన్నాసి వ్యవహారాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసన సభ్యులు రేవంత్ రెడ్డి గురువారం అన్నారు. కిరణ్ ఓ ప్రాంతానికి నేతగా మాట్లాడుతున్నారని, అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించనప్పుడు రాజీనామా చేయాలన్నారు.

రాజీనామా చేసి ఆ ప్రాంత ప్రతినిధిగా ఉండవచ్చునని విమర్శించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు మంత్రులు, కాంగ్రెసు నేతలు కిరణ్ తమ నాయకుడు కాదని చెబుతుంటే ఇంకా కుర్చీని పట్టుకొని వేలాడుతావా అని ప్రశ్నించారు.

ఎవరి ఓటమి.. గెలుపు కాదు: రేణుకా చౌదరి

బిల్లును రాష్ట్ర శాసనసభ తిరస్కరించడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి స్పందించారు. ఇది ఎవరి ఓటమి లేదా విజయం కాదన్నారు. ఎక్కువ మంది సభ్యుల ఆమోదంతోనే బిల్లును తిరస్కరించారని పేర్కొన్నారు. ఎవరు సమస్యలు సృష్టించవద్దన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో చెప్పారని, హింసాత్మక ధోరణితో కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్నారు. అసెంబ్లీలో బిల్లు తిరస్కారానికి గురికావడం కేంద్రంలో కాంగ్రెస్‌కు అవమానమన్నారు.

సిక్సర్ కొడితే స్టేడియం బయట: ఆనం

తెలంగాణ ముసాయిదా బిల్లును తిరస్కరించిన ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసన సభ్యులు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చివరి బంతికి సిక్సర్ కొడితే, బంతి స్టేడియం బయట పడిందని చెప్పారు. తెలుగు ప్రజల ఐక్యతను ముఖ్యమంత్రి, స్పీకర్ లు కాపాడారన్నారు.

English summary

 Telugudeam Party senior leader Revanth Reddy on Thursday fired at Chief Minister Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X