జగన్ బెయిల్‌పై వాదనేది, అసలు ఆట ఇప్పుడే: రేవంత్

 Revanth Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ పైన సిబిఐ ఎందుకు వాదనలు వినిపించలేదని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి మంగళవారం ప్రశ్నించారు. పది ఛార్జీషీట్లలో రూ.1200 కోట్ల కోట్ల అక్రమాలు జరిగాయని సిబిఐ అభియోగాలు నమోదు చేసిందని గుర్తు చేశారు.

విచారణ అధికారులను మార్చేది లేదంటూనే సిబిఐ ఎస్పీ వెంకటేష్‌ను ఎందుకు బదలీ చేశారో చెప్పాలన్నారు. చివరి వరకు ఒకే అధికారిని కొనసాగించాలని తాము మొదటి నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. సుప్రీం కోర్టుకు వెళ్లినా నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్ రాలేదని జగన్‌‍కు ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. కేసు మధ్యలో విచారణ అధికారిని ఎలా బదిలీ చేశారని ప్రశ్నించారు.

సిబిఐ అధికారి బెయల్‌ను అడ్డుకోలేదని ఆరోపించారు. బెయిల్ పైన వాదనలు జరుగుతున్న సమయంలో హడావుడిగా అఫిడవిట్‌లు దాఖలు చేశారన్నారు. నాలుగు కంపెనీల్లో ముద్దాయిగా ఉన్న జగన్ కార్మెల్ ఏషియాలో క్విడ్ ప్రో కో జరగలేదని ఎలా చెబుతారన్నారు.

దొంగ - పోలీసు ఒక్కటయ్యారని ధ్వజమెత్తారు. కేసు విచారణ చేసిన అధికారి కాకుండా మరో అధికారి అఫిడవిట్ ఎలా దాఖలు చేస్తారన్నారు. లంచం ఇచ్చిన నిమ్మగడ్డ బెయిల్‌‍ను అడ్డుకున్న సిబిఐ లంచం తీసుకున్న జగన్‌కు ఎలా సహకరించిందన్నారు.

జగన్‌కు వేసే ఓటు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి వేసినట్లేనని తాము ప్రజలను మేల్కొల్పుతామన్నారు. తమ పార్టీ కాంగ్రెసుతో కుమ్మక్కైతే జగన్‌కు బెయిల్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. 73 కంపెనీలపై ఆధారాలు ఇస్తే 18 కంపెనీల పైనే విచారణ జరిగిందన్నారు. తాము సిబిఐ, ఈడి, ఐటి శాఖల పైన కోర్టుకు వెళ్తామన్నారు. అసలు ఆట ఇప్పుడే ప్రారంభమైందని చెప్పారు. టిడిపి సత్తా ఏమిటో చూపిస్తామన్నారు.

విచారణ సంస్తల పైన కోర్టుకు వెళ్తామని, తాము ఇక కోర్టులో, ప్రజా కోర్టులో తేల్చుకుంటామన్నారు. జగన్ తమ వాడేనని కాంగ్రెసు అధికార ప్రతినిధి పిసి చాకో చెప్పిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. అవినీతిపరులే కాంగ్రెసు పార్టీకి మిత్రులని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+