రేవంత్‌కు కేసీఆర్ బెదిరిపోయారా, అందుకే షాకిచ్చారా?: పక్కాప్లాన్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నిప్పులు చెరుగుతున్నారు. రేవంత్ రెడ్డి దూకుడును కేసీఆర్ తట్టుకోలేకపోయారని, అందుకే ఆయన పైన కుట్ర పన్ని కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు.
మెట్రో రైలు వ్యవహారం నుండి రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. రేవంత్‌ను తట్టుకోలేకనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను మాట్లాడకుండా చేశారని చెబుతున్నారు. ఎంతోమందిని తట్టుకొని నిలబడుతున్న కేసీఆర్.. రేవంత్ రెడ్డిని మాత్రం తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు.

రూ.200 కోట్ల ముడుపులు: ఎర్రబెల్లి నిప్పులు
టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు సోమవారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.200 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. దీని పైన సీబీఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 63 మంది ఎమ్మెల్యేలతో ఐదుగురు ఎమ్మెల్సీలను ఎలా గెలిపించుకుంటారని ప్రశ్నించారు.
మజ్లిస్ పార్టీ కూడా తెలంగాణ ద్రోహి అన్నారు. సెటిల్మెంట్ల కోసమే తమ పార్టీ ఎమ్మెల్యేలు తెరాసలో చేరారని ఆరోపించారు. తెలంగాణ కోసం పనిచేసిన వారికి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు. స్టీఫెన్ స్వయంగా రేవంత్‌కు ఫోన్ చేసి ఓటేస్తానని చెప్పారని, కావాలనే రేవంత్‌ను ఇరికించారని ఆరోపించారు.
తెలంగాణలో ఎమ్మెల్సీ టిక్కెట్లు పొందిన వారు ఏనాడైనా ఉద్యమంలో పాల్గొన్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులు కేసీఆర్ వెంట ఉన్నారన్నారు. తెలంగాణను తిడుతున్న జగన్ మద్దతును తెరాస ఎలా కోరిందో చెప్పాలన్నారు. న్యాయం మా వైపు ఉందని, రేవంత్ పైన భేషరతుగా కేసు ఉపసంహరించుకోవాలన్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications