Chandrababu Arrest:టీడీపీ క్యాడర్‌కు అడ్డంగా చిక్కిన రేవంత్..!

చంద్రబాబు చిక్కుల్లో ఉన్నారు. ఊహించని విధంగా జైలుగోడల మధ్య ఉన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎంతో మందిని నాయకులుగా తీర్చి దిద్దారు. కానీ చంద్రబాబు కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలిచిందెవరు..?చంద్రబాబు కోసం పోరాడుతోంది ఎవరు..? వారిలో పవన్ కళ్యాణ్‌ను ప్రశంసిస్తున్న అభిమానులు రేవంత్ పైన ట్రోలింగ్ ప్రారంభించారు. తన గురువుగా చెప్పుకునే చంద్రబాబుకు జీవితంలో ఇంతకంటే పెద్ద కష్టం ఉంటుందా.. అయినా రేవంత్ ఎందుకు పట్టించుకోవడం లేదు. .?

స్కిల్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు. కేసులో సాంకేతిక కారణాలు ఎలా ఉన్నా.. చంద్రబాబుకు జైలు తప్పలేదు. ఈ సమయంలో చంద్రబాబు ఆశలు పెట్టుకున్న తన మద్దతుదారుల నుంచి స్పందన లేదు. తీర్చిదిద్దిన న్యాయనిపుణులు పత్తా లేరు. చంద్రబాబు బాగున్నప్పుడు అన్నీ అనుభవించిన కొందరు ఎక్కడున్నారో తెలియదు. ఈ సమయంలోనే చంద్రబాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ మొదలైంది.

Revanth Reddy Faces TDP Cadres Criticism Over Silence on Chandrababus Arrest

ఎన్ని విమర్శలు ఆరోపణలున్నా చంద్రబాబు కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ రోడెక్కారు. టీడీపీ నేతలకంటే తీవ్రంగా స్పందించారు. బీజేపీతో పొత్తులో ఉన్నా టీడీపీ పిలుపునిచ్చిన బంద్‌కు మద్దతిచ్చారు. భవిష్యత్ గురించి ఆలోచన చేయకుండా తాను చంద్రబాబుతోనే ఉంటానంటూ తేల్చి చెప్పారు. పవన్ కమిట్‌మెంట్‌ టీడీపీ నేతలకంటే ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే సమయంలో అందరూ గుర్తు చేసుకుంటున్న మరో పేరు రేవంత్ రెడ్డి.

ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ అడ్డంగా దొరికాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబు రేవంత్‌కు పూర్తిగా అండగా ఉన్నారు. రేవంత్ కుమార్తె నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు అంతా తానై చంద్రబాబు బాధ్యత తీసుకున్నారు. కుటుంబ సమేతంగా అన్నింటా పాల్గొన్నారు. సహజంగా విమర్శలు వస్తాయంటే దూరంగా ఉండే చంద్రబాబు రేవంత్ విషయంలో మాత్రం అన్నీ తానై వ్యవహరించారు. అటువంటి రేవంత్ ఇప్పుడేమయ్యారు..? ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రోల్ అవుతోన్న అంశం. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు తన గురువే అని రేవంత్ అంగీకరించారు కూడా. రేవంత్ నాయకుడిగా గుర్తింపు పొందడం, ఎదగడం వెనక కారణం చంద్రబాబు. అటువంటి రేవంత్ చంద్రబాబు అరెస్ట్ అయితే కనీసం ఖండించలేదు. ఎక్కడా ప్రస్తావన కూడ చేయలేదు.

Revanth Reddy Faces TDP Cadres Criticism Over Silence on Chandrababus Arrest

సీతక్క చంద్రబాబు అరెస్టును ఖండించారు. మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్‌లు చంద్రబాబు అరెస్టు సరికాదన్నారు. కానీ రేవంత్ స్పందించకపోవడం వెనక స్వార్థమా రాజకీయమా అనేది హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు పేరెత్తితే తెలంగాణలో మనుగడ ఉండదనేది రేవంత్ భయంగా చెప్తున్నారు. కానీ రాజకీయం కోసం తనకు పొలిటికల్ లైఫ్ ఇచ్చిన వ్యక్తిని మర్చిపోవడాన్ని క్యాడర్ ప్రశ్నిస్తోంది. పవన్‌తో పోల్చి చూస్తోంది. రేవంత్‌ కంటే పవన్ చాలా బెటర్ అంటూ కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+